‘కాకతీయ’ ఎఫెక్ట్..
చేర్యాలకు ఇన్‌చార్జి తహసీల్దార్ నియామకం
*రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయంటూ ‘కాకతీయ’లో కథనం
*లెక్టర్ కె. హైమావతి స్పందనతో శ్రీ శ్రీవాస్య సందీప్‌కు పూర్తి అదనపు బాధ్యతలు

కాకతీయ, చేర్యాల: చేర్యాల తహసీల్దార్ కొర్రా దిలీప్ నాయక్ ఏసీబీ కేసులో అరెస్టు కావడంతో తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండి, భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ సేవలు నిలిచిపోయిన విషయాన్ని ‘కాకతీయ’ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ కె. హైమావతి వెంటనే స్పందించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మిర్దొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో నాయిబ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీవాస్య సందీప్‌కు చేర్యాల తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జి తహసీల్దార్ నియామకంతో గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర రెవెన్యూ సేవలు త్వరలోనే పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ రోజు శనివారం చేర్యాల తాసిల్దార్ గా శ్రీవాస్య సందీప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ‘కాకతీయ’ కథనానికి అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.


