epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వాల్టాకు ఆర్ఎంసీ ప్లాంట్ తూట్లు

వాల్టాకు ఆర్ఎంసీ ప్లాంట్ తూట్లు
భూగర్భ జలాలను తోడేస్తున్న అక్రమ ప్లాంట్
పర్యావరణ విధ్వంసానికి పరాకాష్ట.. ఎండిపోతున్న పంట పొలాలు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
నిబంధనలను గాలికి వదిలేసిన యాజమాన్యం
చట్టపరమైన చర్యల కోసం రైతుల పోరాటం
రంగంలోకి దిగిన ఇంటిలిజెన్సీ నిఘా

కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో వాల్టా చట్ట నిబంధనలను తుంగలో తొక్కి నిర్వహిస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్ స్థానికుల పాలిట శాపంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ ప్లాంట్ అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టం-2002 ప్రకారం వ్యవసాయ భూమిని కమర్షియల్ అవసరాలకు వాడుకోవాలంటే ముందుగా నాలా కన్వర్షన్ అనుమతులు తప్పనిసరి. అయితే, ఇక్కడ నిబంధనలను పక్కన పెట్టి, ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచి ప్లాంట్ను నిర్వహిస్తున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. నేషనల్ హైవేల నిర్మాణం, అభివృద్ధి పేరుతో ఇంతటి ఘోరమైన పర్యావరణ విధ్వంసానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

భూగర్భ జలాల దోపిడీతో ఎండిపోతున్న బోర్లు
ఆర్ఎంసీ ప్లాంట్ నిర్వహణకు నిత్యం వేల లీటర్ల నీరు అవసరం. దీని కోసం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ పొందాలి, కానీ యాజమాన్యం అలాంటి ప్రయత్నం చేయకుండానే భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తోంది. ప్లాంట్ స్థాపన కోసం అనుమతులు లేకుండానే రెండు భారీ బోరుబావులను తవ్వినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న రైతుల బావులు, బోర్లు పూర్తిగా ఎండిపోయి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్లాంట్ నుంచి వెలువడుతున్న సిమెంట్ వ్యర్థాలు, దుమ్ము, ధూళి వల్ల పంట పొలాలు కలుషితమవ్వడమే కాకుండా, గాలి కూడా విషతుల్యంగా మారుతోంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం వెనుక మతలబు ఏమిటో తెలియక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాల్టా చట్టం ఏం చెబుతోంది?
వాల్టా-2002 చట్టం ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ లేకుండా వ్యవసాయ భూమిని ఇతర ప్రయోజనాలకు వాడుకోవడం, అనుమతి లేకుండా భూగర్భ జలాలను వినియోగించడం చట్టరీత్యా నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీ యాజమాన్యాలకు పది వేల రూపాయల జరిమానాతో పాటు, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చట్టం స్పష్టం చేస్తోంది. కాచిరాజుగూడెంలో అక్రమంగా నడుస్తున్న ఈ ప్లాంట్పై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే స్పందించి, ప్లాంట్ను సీజ్ చేయాలని, బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఇప్పటికైనా అక్రమార్కులపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

ఇంటెలిజెన్సీ అధికారుల ఆరా!?
కాచిరాజుగూడెం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ ఆర్ఎంసీ ప్లాంట్పై ‘కాకతీయ’ పత్రిక వరుస కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. పత్రికలో వచ్చిన కథనాలకు ఇంటిలిజెన్సీ అధికారులు స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాంట్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? నాలా పర్మిషన్ అసలు ఎంత భూమికి తీసుకున్నారు? ప్రభుత్వ ఆదాయానికి ఎంత మేర గండి కొట్టారు? అనే విషయాలపై నిఘా వర్గాలు లోతుగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు నిఘా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అక్రమ ప్లాంట్ వ్యవహారంలో ఎవరెవరికి ప్రమేయం ఉందనే అంశంపై ఇప్పుడు స్థానికంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.