epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్సారెస్పీ భూముల క‌బ్జా

ఎస్సారెస్పీ భూముల క‌బ్జా
పంజా విసురుతున్న అక్ర‌మార్కులు
ఎక్స్‌కవేటర్లతో యథేచ్ఛగా భూమిని చదును
అధికారుల హెచ్చరికలనూ లెక్కచేయని దుండగులు
నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌లు
క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం
ముడుపుల మత్తులో అధికారుల ఉదాసీనతపై అనుమానాలు
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై స్థానికుల తీవ్ర ఆందోళన

కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) శాఖకు చెందిన విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల పంజా మళ్లీ మొదలైంది. అధికారుల హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా, భారీ యంత్రాలతో భూమిని చదును చేస్తుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలకు ఎవరు అండగా ఉంటున్నారనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేశవపట్నం గ్రామంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి జేసీబీలతో చదును చేస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో, ప్రాజెక్టు ఏఈ పావని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ భూమి పూర్తిగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ పరిధిలోనిదేనని నిర్ధారించుకున్న ఏఈ, అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను పిలిచి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పనులు నిలిపివేయాలని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, గురువారం కూడా లష్కర్ సిబ్బందిని అక్కడికి పంపినప్పటికీ, దుండగులు మళ్ళీ అదే భూమిలో జేసీబీలతో చదును పనులు చేపట్టడం అక్రమార్కుల దురుసుతనానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు.

ముడుపుల మత్తులో అధికారులు? వ్యవస్థలో లోపాలు!
అధికారులు అక్రమాలను అరికట్టడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారా? లేక ముడుపుల మత్తులో అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే కబ్జాదారులు ఇంతటి ధైర్యంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలు పత్రికల్లో ఈ కబ్జా వ్యవహారంపై వరుస కథనాలు వస్తున్నా, అధికారులు నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేయడం వెనుక ఆంతర్యమేమిటో తెలియడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఈ పావనిని వివరణ కోసం ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ స్పందన లేకపోవడం, అధికారుల పనితీరుపై మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.

ప్రభుత్వ ఆస్తుల రక్షణకు చర్యలేవి?
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఎస్‌ఆర్‌ఎస్‌పీ శాఖ, అక్రమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కబ్జాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేలా తక్షణమే కంచె వేయడం వంటి చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇలాగే మౌనం వహిస్తే, ప్రజలే స్వయంగా రంగంలోకి దిగి నిరసనలు చేపట్టాల్సి ఉంటుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.