epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌
కరీంనగర్‌లో రెండు పార్టీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌
కేంద్ర‌మంత్రి బండి కార్యాల‌యం ముట్ట‌డికి కాంగ్రెస్ శ్రేణుల య‌త్నం
అడ్డుకున్న బీజేపీ శ్రేణులు.. ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య తోపులాట‌
ప‌ర‌స్ప‌రం దాడి చేసుకున్న రెండు పార్టీ నేత‌లు
ప‌రిస్థితి చేదాట‌డంతో పోలీసుల లాఠీఛార్జ్
పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలు

కాకతీయ, కరీంనగర్: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో కరీంనగర్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగా భారీగా మోహరించిన పోలీసులు ఎంపీ కార్యాలయం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. అయితే నిరసనకారులు బారికేడ్లను దాటి ఎంపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, కొద్దిసేపటికే తోపులాట, కర్రలతో పరస్పర దాడులకు దారి తీసింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ నిర్వహించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొంతసేపు ఎంపీ కార్యాలయం పరిసర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, అనంతరం పోలీసులు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులు తమ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు, తాము నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లగా బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.