ఆస్ట్రేలియాలో కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు
కాకతీయ, సిరిసిల్ల టౌన్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ముందుగానే ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, ఐటీ రంగ అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రగతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. కేటీఆర్‌కు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ సభ్యులు రాజేష్ గిరి రాపోలు, రవి శంకర్, దుపాటి పరశురామ్, ముటుకుల్ల జస్వంత్, కొడెరపు శ్యామ్ గిలకతుల ,శ్రీనివాస్ సుతారి , రాహుల్ రాంపల్లి ,లక్ష్మణ్ నల్లాన్ ,వెంకట్ సాయి గుప్తా, నిఖిలేష్ బొందుగుల, రణధీర్ గిరి రెడ్డి, మహమ్మద్ ఇస్మాయిల్, రాజ్‌కుమార్ నర్మేటి, అమర్ రెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సభ్యులు కేటీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

