సబ్సిడీపై రైతులకు విద్యుత్ మోటార్ల పంపిణీ
కాకతీయ, గుండాల : జలగం వెంగళరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై 16 విద్యుత్ మోటార్లను బుధవారం పంపిణీ చేశారు. గుండాల సర్పంచ్ కోరం సీతారాములు లబ్ధిదారులకు మోటార్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత రైతులకు ట్రస్ట్ అందిస్తున్న సహాయం అభినందనీయమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయాభివృద్ధి సాధించాలని కోరారు. గోవింద నరసింహారావు మాట్లాడుతూ, జలగం ప్రసాదరావు సారథ్యంలో ట్రస్ట్ విద్యుత్ లైన్ల ఏర్పాటుతో పాటు సబ్సిడీపై మోటార్లు అందించడం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో ఈసం కృష్ణ, బొబ్బిలి సమ్మయ్య, గడ్డం సమ్మయ్య, గడ్డం కృష్ణ, గుర్రం రాములు, నిట్ట వెంకన్న, ఎస్.డి. కుద్దూస్, ఈసం సమ్మయ్య, తౌడుశెట్టి నాగరాజు తదితర రైతులు పాల్గొన్నారు.

