కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సాయిని మల్లేశం హర్షం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, పార్టీ జాతీయ నాయకత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన మల్లేశం.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయాలు, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.తన నియామకాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు,శ్రేయోభిలాషులందరికీ సాయిని మల్లేశం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

