epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కామేపల్లి కాంగ్రెస్‌లో క‘లహం’..!

కామేపల్లి కాంగ్రెస్‌లో క‘లహం’..!
డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఇరువర్గాల ఘర్షణ
పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత.. మాజీ ఎంపీటీసీపై దాడి ఆరోపణ
చేరికలతో పెరిగిన పాత, కొత్త నేతల ఆధిపత్య పోరు
వర్గాలను ప్రోత్సహిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలి : గింజల నర్సింహారెడ్డి

కాకతీయ, కారేపల్లి/కామేపల్లి : కామేపల్లి కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య కొంతకాలంగా సాగుతున్న విభేదాలు డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఘర్షణకు దారితీశాయి. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోనే ఇరువర్గాలు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్యపై మరో వర్గానికి చెందిన వారు దాడి చేశారంటూ ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఇటీవల బీఆర్ఎస్‌, టీడీపీ తదితర పార్టీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరడంతో పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరిందనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు తామే తీసుకొచ్చామని రెండు వర్గాలు పరస్పరం క్రెడిట్‌ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ విభేదాలు క్రమంగా బహిరంగ వివాదాలుగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కమిటీల ఏర్పాటులోనూ పోటీ

పార్టీ పదవుల ఎంపికలోనూ వర్గపోరు ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ కమిటీల ఏర్పాటు విషయంలో సాతానిగూడెం, కొత్తలింగాల గ్రామాల్లో రెండు వర్గాలు చెరో కమిటీ ఏర్పాటు చేసుకోవడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఒకే పార్టీకి రెండు కమిటీలు ఎలా ఉంటాయంటూ పలువురు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయాల్సిన సమయంలోనే కమిటీల విషయంలో వివాదాలు తలెత్తడం పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండల అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు, పుచ్చకాయల వీరభద్రం, పతే అహ్మద్‌పై డీసీసీ జిల్లా కార్యదర్శి గింజల నర్సింహారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆధిపత్యానికి ప్రాధాన్యం ఇస్తున్న వారిని వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అంతర్గత విభేదాలకు కారణమవుతున్న నాయకులపై డీసీసీ, పీసీసీ అధ్యక్షులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, వర్గపోరుతో కార్యకర్తల్లో అయోమయం సృష్టించడం సరికాదని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.