epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోరేకల్‌ ఇసుకలో అదనపు దందా!

కోరేకల్‌ ఇసుకలో అదనపు దందా!
రసీదులో ఉన్నదానికంటే రూ.3,500 వరకు అదనం?
చార్జీలన్నీ అధికారికంగానే.. మరి ఈ వసూళ్లెందుకు?
35 టన్నులకు రూ.13,783 చెల్లించిన లారీ ఓన‌రు
రసీదు బయట వసూళ్లపై కాక‌తీయ చేతికి చిక్కిన‌ వీడియోలు
విచారిస్తున్నామ‌ని కాక‌తీయకు పీవో వివ‌ర‌ణ‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడి నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రుసుములన్నీ పక్కాగా వసూలు చేస్తోంది. ఇసుక ధరతోపాటు సేవా రుసుము, రోడ్డు డ్యామేజ్‌ చార్జీ, వెయిమెంట్‌ ఫీజు, జీఎస్టీ.. ఇలా ఒక్కో అంశానికి ప్రత్యేకంగా లెక్క కట్టి అధికారిక రసీదు జారీ చేస్తోంది. అయినా.. రసీదులో పేర్కొన్న మొత్తానికి అదనంగా ఒక్కో లారీకి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడం విస్మయానికి గురిచేస్తోంది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కోరేకల్‌ ఇసుక స్టాక్‌యార్డులో ఈ అదనపు వసూళ్లకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వమే ప్రతి రుసుముకూ లెక్క చెబుతున్నప్పుడు.. రసీదు బయట వసూలవుతున్న అదనపు మొత్తం ఎవరి లెక్క? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోరేకల్‌ స్టాక్‌యార్డు నుంచి 35 మెట్రిక్‌ టన్నుల ఇసుకకు జారీ చేసిన అధికారిక రసీదు ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. సాండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా జారీ చేసిన ఈ రసీదులో ఇసుక ధర రూ.13,125గా ఉంది. టీజీఎండీసీ సేవా రుసుము కింద రూ.1,225, రోడ్డు డ్యామేజ్‌ చార్జీ రూ.250, వెయిమెంట్‌ ఫీజు రూ.100గా పేర్కొన్నారు. వీటికి వర్తించే జీఎస్టీని కలిపి మొత్తం రూ.13,783 చెల్లించినట్లు రసీదులో స్పష్టంగా నమోదైంది.

ప్రతి రుసుముకూ ప్రత్యేక లెక్క

35 మెట్రిక్‌ టన్నుల ఇసుకకు టన్నుకు రూ.375 చొప్పున రూ.13,125 ధర నిర్ణయించారు. దీనిపై సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ వసూలు చేశారు. ఇసుక ధరతోపాటు టీజీఎండీసీ సేవా రుసుముగా టన్నుకు రూ.35 చొప్పున రూ.1,225 తీసుకున్నారు. రోడ్డు డ్యామేజ్‌ చార్జీగా రూ.250, వెయిమెంట్‌ ఫీజుగా రూ.100ను కూడా రసీదులో నమోదు చేశారు. అంటే.. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలన్నింటినీ కలిపితే వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్నది రసీదులోనే స్పష్టంగా ఉంది. ఇంత పక్కాగా లెక్కలు ఉన్నప్పుడు.. రసీదు బయట మరో మొత్తాన్ని ఎందుకు చెల్లించాల్సి వస్తోందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

రసీదులో ఒక లెక్క.. బయట మరో లెక్క?

కోరేకల్‌ స్టాక్‌యార్డులో లారీకి ఇసుక లోడ్‌ చేసిన తర్వాత అదనంగా రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆరోపణలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అదనపు వసూళ్ల ఆరోపణల్లో వాస్తవమెంతో తేల్చడం అధికారులకు పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టాక్‌యార్డులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతోపాటు లారీ ఎంట్రీ రిజిస్టర్‌, వెయిమెంట్‌ వివరాలు, రోజువారీగా జారీ చేసిన రసీదులు, ఇసుక విక్రయాల లెక్కలను సరిపోలిస్తే వాస్తవం బయటపడే అవకాశం ఉంది. ఒక లారీకి రసీదులో ఎంత చూపించారు? వాస్తవంగా ఎంత డబ్బు చెల్లించారు? అదనపు మొత్తం ఎవరికి ఇచ్చారు? నగదుగా ఇచ్చారా? డిజిటల్‌ చెల్లింపులు జరిగాయా? అన్న వివరాలను పరిశీలిస్తే వ్యవహారం తేలిపోతుంది. ముఖ్యంగా వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.