తల్లిని కోల్పోయిన కూతుళ్లకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఓదార్పు
★మృతురాలు ఉమా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి
కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన మహిళా రైతు వడ్డే ఉమా సంతాప సభ గురువారం ఆమె స్వగ్రామంలో నిర్వహించారు. ఈ సంతాప సభకు వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంద్రావతి హాజరై ఉమా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మృతురాలు ఉమాకు ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చంద్రావతి వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న ఆడబిడ్డలకు ధైర్యం చెబుతూ, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల మరణం చెందిన తల్లి తమపై పెట్టుకున్న ఆశలు, కలలను సాకారం చేయడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని సూచించారు.
తల్లి ఆశయాలను నెరవేర్చుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలని కూతుళ్లకు చంద్రావతి సూచించారు. ఉమా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు, జిల్లా యువజన నాయకులు ముత్యాల వెంకట అప్పారావు, తాత వెంకటేశ్వర్లు, తాత ఉపేందర్, సురపరెడ్డి రవీందర్ రెడ్డి, చాగంటి కోటయ్య, తమ్మిన్ ముత్తయ్య, దొంతు దాసు, వడ్డే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

