epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ!
చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య
రూ.14 లక్షల సాయం అందేలా చొరవ
శస్త్రచికిత్స విజయవంతం.. కోలుకున్న చిన్నారి
‘జస్విక శ్రీ’గా నామకరణం.. కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఆపదలో ఉన్న ఓ చిన్నారి కుటుంబానికి అండగా నిలిచారు ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న పసికందుకు చికిత్స చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం అందేలా చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో చిన్నారి గుండె శస్త్రచికిత్సకు అవసరమైన రూ.14 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. చికిత్స విజయవంతం కావడంతో ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకుంది. ఖమ్మం నగరానికి చెందిన కాంపాటి రాకేష్‌, మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ జన్మించింది. పుట్టిన 12 రోజులకే చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించడంతో.. అందుకు అయ్యే ఖర్చు భారీగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఖమ్మం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న చిన్నారి నానమ్మ నరసమ్మ ఈ విషయాన్ని కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి చిన్నారి వైద్యానికి అవసరమైన సహాయం అందించే ప్రయత్నాలు ప్రారంభించారు.

రూ.14 లక్షల సాయం.. విజయవంతంగా ఆపరేషన్‌
హృదయ స్వచ్ఛంద సంస్థతోపాటు ప్రభుత్వ సహకారంతో చిన్నారి గుండె శస్త్రచికిత్సకు అవసరమైన రూ.14 లక్షల ఆర్థిక సాయం మంజూరయ్యేలా కమిషనర్‌ చొరవ తీసుకున్నారు. దీంతో జూలై 28న చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. చికిత్స అనంతరం చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులు మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చారు. గ్రీవెన్స్‌ కార్యక్రమంలో కమిషనర్‌ను కలిసి తమ కుటుంబానికి చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

‘జస్విక శ్రీ’గా నామకరణం

తమ కుమార్తెకు కమిషనర్‌ పేరే పెట్టాలని కుటుంబ సభ్యులు కోరారు. దీంతో అభిషేక్‌ అగస్త్య సంతోషం వ్యక్తం చేస్తూ చిన్నారికి ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేశారు. చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న తమ కుటుంబానికి సకాలంలో స్పందించి చిన్నారి ప్రాణాలు నిలిచేలా వైద్య సాయం అందేందుకు కృషి చేసిన కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యకు రాకేష్‌, మాధవి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

పెద్ది… నిన్ను మరవదు ఈ గడ్డ..!

పెద్ది... నిన్ను మరవదు ఈ గడ్డ..! ఉద్య‌మ‌కారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్...

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి దారుణం 50 శాతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.