epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య
నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి
ఫోన్‌ చేసి పిలిచి దాడి.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి
మణుగూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం

కాకతీయ, మ‌ణుగూరు : మణుగూరులో పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నేతాజీ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన మూకుమ్మడి దాడిలో సింహాద్రి శివకుమార్‌ అలియాస్‌ శివ (28) తీవ్రంగా గాయపడి గురువారం మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఇంటీరియర్‌ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శివను ఫోన్‌ చేసి గ్రౌండ్‌కు పిలిపించి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనతో మణుగూరులో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ వద్ద పనిచేసే సుందరయ్యనగర్‌కు చెందిన సతీష్‌తో గతంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకున్న ఎంకే గ్యాంగ్‌ నాయకుడు రమాకాంత్‌ అలియాస్‌ రమ్మీ అలియాస్‌ జెట్టి, అతని అనుచరులు శివ మణుగూరుకు వస్తే చంపేస్తామని ఫోన్‌లో బెదిరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 7 గంటలకు శివ హైదరాబాద్‌ నుంచి మణుగూరుకు వచ్చాడు. అనంతరం రమాకాంత్‌ అలియాస్‌ జెట్టి ఫోన్‌ చేసి నేతాజీ గ్రౌండ్‌కు రావాలని పిలవడంతో ఇంటి పక్కన ఉండే ఉదయ్‌కుమార్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న రమాకాంత్‌ అలియాస్‌ జెట్టి, భరత్‌, సాధిక్‌, వినయ్‌, ధినేష్‌, జంపయ్య, ప్రసాద్‌ తదితరులు శివపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉదయ్‌కుమార్‌పై కూడా దాడి చేసినట్లు తెలిపారు.

ఆసుపత్రికి తరలించేలోపే..
దాడిలో తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శివ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శివ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఘటనలో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. మణుగూరులో యువకుల గ్యాంగ్‌లు ఏర్పడి రాత్రివేళల్లో గుంపులుగా తిరగడం, బైక్‌లపై స్టంట్లు చేయడం, ముగ్గురు చొప్పున ప్రయాణించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదకద్రవ్యాల ప్రభావంతో కొందరు యువకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణనష్టాలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
ఘటనపై సమాచారం అందుకున్న మణుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి దారితీసిన కారణాలు, ఘటనలో పాల్గొన్న వారి వివరాలు, శివ మృతికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. గ్రౌండ్‌లో జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు కొండా సుష్మిత బహిరంగ క్షమాపణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.