epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నల్లచొక్కాలతో నిరసన చేస్తే పోలీసుల దాడులా?

నల్లచొక్కాలతో నిరసన చేస్తే పోలీసుల దాడులా?
మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో వ్యవహరించిన తీరు నీచం
పోలీసులను అడ్డుపెట్టుకొని రాక్షస పాలన సాగిస్తున్నారు
1000 రోజుల కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు ఒరిగిందేమీ లేదు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కాకతీయ, పాలకుర్తి : నల్లచొక్కాలతో నిరసన తెలిపిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తెలంగాణ అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేయడం అమానుషమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆనాడు పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ నల్లచొక్కాలతో నిరసనకు వెళ్లినప్పుడు ఇదే నిబంధనలు, ఇదే తెలివి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మీకో న్యాయం.. మాకో న్యాయమా? అని నిలదీశారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనకు నిరసనగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ఆయన సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఉషాదయాకర్‌రావు, బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల దాడికి నిరసనగా రాస్తారోకో చేపట్టి, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా, మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యుల గొంతు నులిమి, చీర లాగడం నీచమైన చర్య అని మండిపడ్డారు. శాసనసభలోనే పోలీసులు అమానుషంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రేవంత్‌రెడ్డి రాక్షస రాజ్యం నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా 6 గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఎర్రబెల్లి విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన మహాలక్ష్మి పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పి ఎందుకు నెరవేర్చడం లేదో రేవంత్‌రెడ్డి ప్రజలకు, మహిళలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశారని విమర్శించారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4 వేల పెన్షన్‌, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్‌ ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించకుంటే కాంగ్రెస్‌ పని ఖతమవుతుందని హెచ్చరించారు.

కేసీఆర్‌ పాలనలోనే సంక్షేమానికి పెద్దపీట

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజలు, మహిళలు సంతోషంగా జీవించారని ఎర్రబెల్లి అన్నారు. ప్రజలు అడగకముందే కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను అమలు చేశారని తెలిపారు. వృద్ధుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచి, ఒంటరి మహిళలకు రూ.2 వేల పెన్షన్‌ అందించారని అన్నారు. వికలాంగులకు రూ.4 వేల పెన్షన్‌ అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పీడ విరగడ కావడానికి మరో 2 ఏళ్ల సమయం మాత్రమే ఉందని, ఆ తర్వాత మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వం వస్తుందని ఎర్రబెల్లి అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసింది, చేసేది కూడా కేసీఆర్‌ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : రెవెన్యూ పట్టా,...

చిన్నారి చికిత్సకు దాతలే దిక్కు

చిన్నారి చికిత్సకు దాతలే దిక్కు విద్యుత్ ప్రమాదంలో జీవితం అతలాకుతలం రూ.25 లక్షల నుంచి...

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.