చెరువు మత్తడితో గ్రామస్థుల సంబరాలు
కాకతీయ, చిగురుమామిడి: సుందరగిరి గ్రామంలోని ఊర చెరువు మత్తడి పడి పొంగిపొర్లుతుండటంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సర్పంచ్ జంగ శిరీష రమణారెడ్డి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో గ్రామంలో తాగునీటికి, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పంటలు బాగా పండి రైతులందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా వర్ధిల్లాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. చెరువు నిండటంతో గ్రామ ప్రజల్లో ఆనందం నెలకొందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెడబోయిన రాజు, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్‌కుమార్, శ్రీమూర్తి శ్రీనివాస్, మంథని ప్రియాంక మహేందర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గందే సంతోష్‌కుమార్, మాజీ దేవస్థానం చైర్మన్ గందే సంపత్‌కుమార్, పెసరూ శ్రీనివాస్, మారుపాక రమేష్, సుంకరి శ్రీనివాస్, కక్కెర్ల వీరకుమార్, పాలకేంద్రం చైర్మన్ పిట్టల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

