పండుగా సాయన్న సేవలు చిరస్మరణీయం
రాయపర్తిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముదిరాజ్ సంఘం నాయకులు
కాకతీయ,రాయపర్తి : పేదల పక్షాన నిలబడి భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజా వీరుడు,పండుగ సాయన్న చేసిన సేవలు చిరస్మరణీయమని ముదిరాజ్ సంఘం నాయకులు కొనియాడారు.గురువారం మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో సాయన్న జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ క్రమంలో సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ఆనాడు దొరల,భూస్వాముల అరాచకాలను ఎదిరించి,పేదల ఆకలి తీర్చడానికి సాయన్న చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని అన్నారు.శతాబ్దాలు గడిచిన తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడని కొనియాడారు.సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రుద్రవీణ సుధాకర్,మత్స్య పారిశ్రామిక కర సంఘం డైరెక్టర్ చెవ్వు కాశీనాథం,మండల అధ్యక్షుడు ముద్రబోయిన వెంకన్న,ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మీనారాయణ,సుధాకర్,శ్రీను,రామ్మూర్తి,యాక న్న అశోక్,నరేష్,లక్ష్మీనారాయణ,సాయిలు,రమేశ్,సంఘం సభ్యులు పాల్గొన్నారు.

