epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!
దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు?
తమ్మిడిహట్టి నీటి లభ్యతపై కేంద్రం మూడు లేఖలు ఇచ్చింది
మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా మూడేళ్లుగా కాలయాపన
ఎన్ని నీళ్లు ఎత్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి
గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తారా? ఉత్తమ్‌కు హరీశ్‌రావు సవాల్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నీటిని ఎత్తుతుంటే తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల నుంచి నీటిని ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టులో ఎన్ని మోటార్లు నడిపారు, ఎన్ని గంటలు పంపింగ్‌ చేశారు, ఎంత నీటిని ఎత్తిపోశారో పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి వెంటనే మరమ్మతులు చేసి కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తాలని కోరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నీటిని ఎత్తారో ప్రభుత్వం వెల్లడించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టులోనూ ఐదు మోటార్లలో రెండు మాత్రమే నడుస్తున్నాయని, 12 గంటలు నడిపి 12 గంటలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నడిపి ఉంటే వరంగల్‌ జిల్లాతో పాటు కరీంనగర్‌లోని కొంత ప్రాంతం సస్యశ్యామలంగా మారేదన్నారు. పక్క రాష్ట్రంలో పంటలకు సెలవు ప్రకటించని పరిస్థితుల్లో తెలంగాణలో క్రాప్‌ హాలిడే ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేపట్టాలి

కన్నెపల్లి పంపుహౌస్‌ మోటార్లను నడిపి నీటిని ఎత్తాలని విశ్రాంత ఇంజినీర్లు సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. రాజకీయ కారణాలతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారని ఆరోపించారు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నీటిని ఎత్తాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని చెప్పిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగున్నాయని కేంద్ర జల, విద్యుత్‌ పరిశోధన సంస్థ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అని, దాని ద్వారా కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు.

మహారాష్ట్రతో చర్చల్లో బీఆర్‌ఎస్‌ చొరవ

తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లకు అంగీకరించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలుమార్లు మహారాష్ట్రతో చర్చలు జరిపిందని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు 2014 జూలై 23న మహారాష్ట్రకు వెళ్లామని, ఆ తర్వాత 2014 ఆగస్టు 16, డిసెంబర్‌ 23, 2015 ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 17 తేదీల్లోనూ చర్చలు జరిపినట్లు వివరించారు. అప్పటి కాంగ్రెస్‌ మంత్రి హసన్‌ ముష్రఫ్‌తో పాటు మహారాష్ట్ర ప్రతినిధులను కలిసి తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించాలని కోరామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం చర్చలు ప్రారంభించడానికే 1,054 రోజులు తీసుకుందని విమర్శించారు. గతంలో తాము అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే పలుమార్లు చర్చలు జరిపామని పేర్కొన్నారు.

తమ్మిడిహట్టి నీటి లభ్యతపై కేంద్రం లేఖలు

తమ్మిడిహట్టి వద్ద తెలంగాణకు అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో లేదని కేంద్ర జల సంఘం మూడు లేఖల్లో పేర్కొందని హరీశ్‌రావు తెలిపారు. 2015 ఫిబ్రవరి 18న 160 టీఎంసీల నీరు అందుబాటులో లేదని, మార్చి 4న ఎగువ రాష్ట్రాల వాటాలు, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఎంత నీటిని మళ్లించవచ్చో పరిశీలించాలని సూచించినట్లు వివరించారు. 2015 మార్చి 13న అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కూడా ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలని లేఖ రాసినట్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లోనే మేడిగడ్డ నుంచి 240 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాలకే సుమారు 50 టీఎంసీలు అవసరమవుతాయని, సాగునీటి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

వార్ధా, చెన్నూరు ప్రాజెక్టులనూ ముందుకు తీసుకెళ్లాలి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. వార్ధా నదిపై 20 టీఎంసీల నీటి వినియోగంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నివేదిక వెనక్కి వచ్చిందని, ఆ తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. తమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని, అయితే నీటి లభ్యత, ఆయకట్టు, వ్యయం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.25 వేల కోట్లతో తమ్మిడిహట్టి నుంచి నీటిని తీసుకొచ్చి సుందిళ్లలో పోస్తారంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తారా? ఉత్తమ్‌కు సవాల్‌

తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొస్తామని చెబుతున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన వాదనను సమర్థించే సమగ్ర ప్రాజెక్టు నివేదికను బయటపెట్టాలని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. గ్రావిటీ ద్వారా నీటిని తీసుకురావడం సాధ్యమని నిరూపించాలని, లేకపోతే తనతో పాటు రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనాలు, నీటి లభ్యత, ఆయకట్టు వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. “నీళ్లను కొనలేం.. మరి అందుబాటులో ఉన్న నీటిని ఎందుకు ఎత్తడం లేదు?” అని ప్రశ్నిస్తూ, మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేసి సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు కాసుల దందాకు టీజీఎండీసీ అధికారుల అండ! ఆదివారం ఒక్కో...

రేవంత్‌.. చరిత్రలో నిలుస్తావా? కాలగర్భంలో కలిసిపోతావా?

రేవంత్‌.. చరిత్రలో నిలుస్తావా? కాలగర్భంలో కలిసిపోతావా? జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై శాశ్వత పరిష్కారం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.