epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం!

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం!
భ‌ట్టి కాళ్ల‌పై ప‌డిన ఎన్‌హెచ్ఎం మ‌హిళా ఉద్యోగినులు
వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన స‌మ‌యంలో ఘ‌ట‌న‌
డిప్యూటీసీఎంలో ప‌ర్య‌ట‌న‌లో మ‌హిళా పోలీసులేరీ..?
28 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు
నిర‌స‌న వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉన్న విష‌యం ఎందుకు గుర్తించ‌లేదు..
గుర్తించి కూడా అధికారులు లైట్ తీసుకున్నారా..?
పోలీసు వర్గాలతో పాటు ప్రజల్లోనూ భద్రతా వైఫల్యంపై చర్చ

కాకతీయ, హనుమకొండ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ‌రంగ‌ల్‌ పర్యటనలో పోలీసుల భద్రతా ఏర్పాట్లపై తీవ్ర చర్చ మొదలైంది. 28 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ, మహిళా ఉద్యోగులు సహా కొందరు ఆయన కాళ్లపై పడటం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉన్నప్పటికీ ఉద్యోగులు ఇంత దగ్గరకు ఎలా చేరుకున్నారు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు పోలీసు వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 28 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిప్యూటీ సీఎంను కలవాలని వారు ప్రయత్నించడం సహజమే. ఇంతకాలంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ఆయన పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు వస్తారనే కనీస అంచనా పోలీసు నిఘా విభాగానికి లేదా ఉండి కూడా లైట్ తీసుకున్నారా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ముందస్తు సమాచారం సేకరించడంలో వైఫల్యమా? లేక భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యమా? అన్న కోణంలో చ‌ర్చ‌ సాగుతోంది.

ప‌దుల సంఖ్య‌లో వైస్సార్ న‌గ‌ర్ వాసులు అదుపులోకి

వైఎస్సార్‌ నగర్‌ గుడిసెలవాసులు, బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అర్ధరాత్రి, తెల్లవారుజామున చర్యలు చేపట్టి ప‌దుల సంఖ్య‌లో అదుపులోకి తీసుకున్నారు. కొంత‌మంది స్టేష‌న్ల‌కు కూడా త‌ర‌లించారు. మ‌రికొంత‌మందిని గృహ నిర్బంధం చేశారు. నిరసనలు, ఆందోళనలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. 28 రోజులుగా నిరసన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు డిప్యూటీ సీఎంను కలిసేందుకు వస్తారనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారన్న సందేహాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు డిప్యూటీ సీఎం వద్దకు చేరుకుని కాళ్లపై పడే పరిస్థితి రావడం భద్రతా సిబ్బంది అప్రమత్తతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆయన చుట్టూ ఉన్న భద్రతా వలయంలో మహిళా పోలీసుల సంఖ్య, వారి విధుల నిర్వహణపై కూడా చర్చ జరుగుతోంది. మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చినప్పుడు వారిని నియంత్రించేందుకు తగినంత మంది మహిళా పోలీసులు ఎందుకు అందుబాటులో లేరు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకోవాలి కరీమాబాద్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు...

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు!

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు! క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి...

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు!

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు! వరంగల్‌ ప్రధాన జిల్లా న్యాయస్థానం...

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం!

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం! రేపు హనుమకొండలో రెండో దశ ఉద్యమకారుల...

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు...

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి! నవంబర్‌ 14న హనుమకొండలో ఆరో రాష్ట్ర...

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు ఐటీడీఏ పీఓ క్షేత్రస్థాయి పరిశీలన రైనిగూడెం ఆశ్రమ...

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు పోలీసుల కార్డన్‌ సెర్చ్‌లో 4 వేల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.