తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు
రూ.10 వేల నగదు, 15 తులాల వెండి అపహరణ
కాకతీయ, చేర్యాల : ఇంటికి తాళం వేసి పండుగకు ఊరెళ్తే దొంగలు చేతివాటం ప్రదర్శించారు. చేర్యాల పట్టణానికి చెందిన గుండేటి బాలమణి దీపావళి సందర్భంగా ఇంటికి తాళం వేసి కరీంనగర్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన పని మనిషి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి బాలమణికి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన చేరుకున్న బాలమణి ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గుర్తించారు. గుర్తుతెలియని దొంగలు రూ.10 వేల నగదుతో పాటు సుమారు 15 తులాల వెండి విగ్రహాలను అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 87126 67356 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.


