epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం!

పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం!
* గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ చామల ప్రశ్నల వర్షం..
* కాంగ్రెస్ కార్యకర్తలను ‘రౌడీలు, గంజాయి బ్యాచ్, తాగుబోతుల బ్యాచ్’ అంటూ ఫైర్!
* లబ్ధిదారుల కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జి!
కాకతీయ, చేర్యాల: పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాల కార్యక్రమం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. పెన్షన్ ప్రొసీడింగ్ కార్డుల పంపిణీ వేదికపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పలు అంశాలపై నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం మొదలై క్రమంగా తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ‘రౌడీలు, గంజాయి బ్యాచ్, తాగుబోతుల బ్యాచ్’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగ వేదికపై రాజకీయ కార్యకర్తలను ఉద్దేశించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రజాప్రతినిధుల హోదాకు తగిన భాషను ఉపయోగించాల్సిన బాధ్యత లేదా? అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారితీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు లాఠీచార్జి చేసినట్లు సమాచారం.పెన్షన్ కార్డులు అందుకుని సంతోషంగా వెళ్లాల్సిన లబ్ధిదారులు నేతల మధ్య రాజకీయ ఘర్షణతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పేదల సంక్షేమం కోసం నిర్వహించిన కార్యక్రమం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత దూషణలతో రసాభాసగా మారింది. సంక్షేమ వేదికపై రాజకీయ సమరం.. ఎంపీ చామల నిలదీత.. పల్లా ఘాటు వ్యాఖ్యలు.. చివరకు పోలీసుల లాఠీచార్జి! ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన వేదికపై నేతలు పరస్పర విమర్శలకు దిగడం, బహిరంగంగా పరుష పదజాలం ఉపయోగించడంపై చేర్యాల ప్రాంతంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు రైతుల కార్యక్రమాలకు దూరంగా...

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు చేర్యాల మార్కెట్‌ కమిటీ...

తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు

తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు రూ.10 వేల నగదు, 15 తులాల వెండి...

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి *నవంబర్ 15న రైతు బహిరంగ సభకు...

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి!

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి! కార్యకర్తల అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయమా? బంగారు...

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య చేర్యాల అంబేద్కర్ నగర్‌లో విషం తాగి 83...

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా!

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా! వాహనాలపై కేసులు నమోదు : ఎస్‌ఐ...

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.