మామునూరు పోలీస్‌స్టేషన్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!
కాకతీయ, వరంగల్ బ్యూరో : మామునూరు పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ తనిఖీలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పర్వతగిరి సీఐ ఆర్.సంతోష్ కుమార్, మామునూరు ఇన్స్పెక్టర్ ఈ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

