epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వామ్మో కోతులు

  • హుజురాబాద్‌లో వాన‌ర సైన్యం స్వైర విహారం
  • బ‌య‌ట‌కెళ్లాలంటే జంకుతున్న జ‌నం
  • కోతి దాడి చేయ‌డంతో గాయ‌ప‌డి మృతి చెందిన ఓ వ్య‌క్తి
  • అనేక మంది చిన్నారులు, వృద్ధుల‌కు గాయాలు
  • స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఎమ్మెల్యే చెప్పినా ప‌ట్టించుకోని అధికారులు
  • కోతుల బెడ‌ద‌తో వ‌ణికిపోతున్న హుజురాబాద్ జ‌నం

కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ ప‌ట్ట‌ణం నిండా వానర సైన్యం స్వైర విహారం చేస్తోంది. ఎక్క‌డ చూసినా గుంపులు గుంపులుగా వాన‌రాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. జ‌నాల మీద దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో జ‌నాలు ఆందోళ‌న చెందుతున్నారు. వాన‌ర‌ల‌ను బంధించి అట‌వీ ప్రాంతాల్లో వ‌దిలేయాల్సి ఉండ‌గా.. అధికారులు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో వాన‌రాల బెడ‌ద ప‌ట్ట‌ణంలో రోజు రోజుకు ఎక్కువ‌వుతోంది. పాఠశాలలకు, కూరగాయలకు, సరుకులు తెచ్చేందుకు అడుగు బయటపెట్టాలంటె జంకుతున్నారు.

కోతి దాడితో గాయ‌ప‌డి..మృత్యువాత‌

హుజురాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బూర సుదర్శన్ పై ఇటీవల కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించాడు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి, పాతవాడకు చెందిన ఓ మహిళ, విద్యానగర్ కు చెందిన ఓవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు నిత్యం ఏదో ఒక చోట కోతుల దాడిలో గాయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఇంటి పరిసరాల్లో పనులు చేసుకుంటున్న వృద్ధులు, మహిళలపై కోతులు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. అలాగే, ఇండ్లలోకి చొరబడి పప్పులు, బియ్యం, కూరగాయలు, తినుబండారాల వంటి వంట సరుకులను ఎత్తుకెళ్తున్నాయి. ఇంటి ఆవరణలోని పంపు సెట్లు, వాటర్ ట్యాంకులు, నల్లా కనెక్షన్లను విరగ్గొడుతూ ఆస్థి నష్టం కలిగిస్తున్నాయి. పట్టణంలోని సూపర్ బజార్ లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇళ్ల నుంచి పడేసే వ్యర్థాలకు అలవాటు పడి సమీపంలోని దుకాణ సముదాయాలు తెరిచే వరకు రోడ్ల పై నుంచి కదలడం లేదు. రోడ్లపై నిర్వహిస్తున్న కూరగాయలు, పండ్ల బండ్లపై దాడులకు దిగుతున్నాయి.

ఎమ్మెల్యే హామీ ఇచ్చినా.. అధికారులు చ‌ర్య‌ల్లేవ్‌..!

ఇటీవల బతుకమ్మ పండుగ‌ సందర్భంగా జరిగిన రివ్యూ మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోతుల సమస్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గ‌మ‌నార్హం. ప్రజల భద్రత దృష్ట్యా కోతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కోతల సమస్య నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. కోతులను బంధించి, వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఉదయం ఇంటి బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. కోతులు గుంపులు గుంపులుగా చేరుకుని ఇండ్లలోకి చొరబడుతున్నాయి. చేతిలలో కర్ర ఉన్నా కోతులు భయపడడంలేదు. కోతులను కర్రతో కొట్టేందుకు వెళితే మీదికే ఉరికివస్తున్నాయి. కోతుల బెడదకు అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.