epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాహుల్ గాంధీతో యూపీ మంత్రి ఫైటింగ్..ఇదిగో వీడియో..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుండగా, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్యలో కల్పించుకుని మాట్లాడారు. దీంతో రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తూ, “నేను అధ్యక్షత వహిస్తున్న సమావేశం ఇది. మాట్లాడాలంటే ముందు అనుమతి తీసుకోవాలి” అని సూచించారు.

అయితే, రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి దినేశ్ వెంటనే స్పందించారు. ఆయన, “లోక్‌సభలో మీరు స్పీకర్ మాటను గౌరవిస్తున్నారా? అయితే ఇక్కడ నేను మీ మాట ఎందుకు గౌరవించాలి?” అని ప్రతివాదం చేశారు. ఈ మాటలతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. సమావేశంలో ఉన్న ఇతర సభ్యులు పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, దినేశ్ ప్రతాప్ సింగ్ మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు తమదైన కోణంలో ఈ ఘటనను ప్రచారం చేస్తున్నారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రస్తుతం బీజేపీ మంత్రిగా ఉన్న దినేశ్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకే చెందిన నేత. ఆయన 2022లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌తో విజయం సాధించి, యూపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో, రాహుల్ గాంధీతో ఆయన మాటల యుద్ధం మరింత చర్చనీయాంశమైంది.

రాయ్ బరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం తెలిసిందే. దిశా సమావేశం కూడా అభివృద్ధి పనుల సమీక్ష కోసం ఏర్పాటు చేశారు. కానీ, మధ్యలో జరిగిన ఈ వాగ్వాదం కారణంగా అసలు అజెండా పక్కకు పోయింది. ఈ ఘటన రెండు పార్టీల మధ్య ఉన్న ఉద్రిక్తతను బయటపెట్టింది. బీజేపీ నుంచి వచ్చిన సవాళ్లను రాహుల్ గాంధీ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.