epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

  • సోమవారం నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
  • ఖాళీ స్థలాల శుభ్ర‌త‌కు య‌జ‌మానుల‌కు నోటీసులివ్వండి
  • ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • పారిశుద్ధ్య నిర్వహణపై మునిసిప‌ల్ అధికారుల‌తో సమీక్ష‌

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారుల‌కు సూచించారు. శుక్రవారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేందుకు సోమవారం (అక్టోబర్ 13) నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ 10 రోజుల పాటు చేపట్టడం జరుగుతుందని అన్నారు. నగర వ్యాప్తంగా పేరుకు పోయిన చెత్తను శుభ్రం చేయాలని, మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జవాన్ నుంచి సహాయ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని అన్నారు. చెత్త తో ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసిన తర్వాత ముందు, ఆ తరువాత తేడాను తెలియజేసేలా ఫోటోలు తీయాలని, ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన అదనపు లేబర్, ఎక్విప్మెంట్ అందుబాటులో పెట్టడం జరుగుతుందని అన్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లలో ఎక్కడ చెత్త ఉండకుండా శుభ్రం చేయాలని, వర్షాల వల్ల పేరుకుపోయిన మట్టి తొలగించాలని అన్నారు. జవాన్ వారీగా రోజుకు ఏ ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు శుభ్రం చేస్తున్నారు తెలియజేసేలా ప్రొఫార్మా తయారు చేయాలని అన్నారు.

సెల‌వులు ర‌ద్దు చేయండి..

ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ సందర్భంగా శానిటేషన్ జవాన్, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు జవాన్ తన పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ఉదయం సకాలంలో రిపోర్ట్ చేసేలా చూడాలని, అందరికంటే ముందే జవాన్ వచ్చి ఫీల్డ్ లో ఉండాలని, వార్డు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న డ్రైయిన్ పూడిక తీత పనులు చేపట్టాలని అన్నారు. ఏ రోజు తీసిన పూడికతీత అదే రోజు అక్కడి నుంచి తొలగించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. పబ్లిక్ పార్క్, బస్ స్టాప్స్, పబ్లిక్ టాయిలెట్స్ పూర్తిగా శుభ్రం చేయాలని అన్నారు. నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను 100 శాతం శుభ్రం చేయాలని, అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని అన్నారు. ప్రైవేట్ ఖాళీ స్థలాలు శుభ్రం చేసుకునేలా యజమానులకు నోటిసులు జారీ చేయాలని అన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ అనిల్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు,
సూపర్వైజర్, జవాన్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.