epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

92 ఇండిగో విమానాల రద్దు

92 ఇండిగో విమానాల రద్దు

శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్​లో ప్రయాణికుల ఆందోళన

ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసుల‌ రద్దుతో తీవ్ర ఆగ్ర‌హం

దేశంలోనూ వందలాది విమానాలు రద్దు

న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే స‌మ‌స్య‌

ప్ర‌మాదంలో వేలాది ప్రయాణికుల భద్రత

కేంద్రంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఇండిగో విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 92 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 సర్వీసులు ఉన్నాయి. ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసులను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌ఇన్‌ అయిన తర్వాత విమానాల రద్దు సమాచారం ఇవ్వడంపై ఎయిర్​పోర్ట్​లో నిరసన తెలిపారు. మరోవైపు విశాఖపట్నం నుంచి వెళ్లే 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నైకు వెళ్లాల్సినవి కూడా ఉన్నాయి.

నాలుగు రోజులుగా తీవ్ర అవ‌స్థ‌లు

దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో కొన్నిరోజులుగా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని ఎయిర్​పోర్టుల్లో పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ విమానాశ్రయంలో వేల సంఖ్యలో బ్యాగులు టెర్మినల్‌లో పేరుకుపోయాయి. 12 నుంచి 14 గంటల పాటు ప్రయాణికులు నీరు, భోజనం లేకుండా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ సమస్యకు ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ నూతన దశ అమలులో వచ్చిన మార్పులు, క్రూ ప్లానింగ్‌లో పలు లోపాలు, శీతాకాలం కారణంగా ఆపరేషనల్‌ పరిమితులు, సిబ్బంది కొరత వంటి అంశాలు డీజీసీఏ సమీక్షలో ప్రధాన కారణాలుగా తేలాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ నిబంధనల నుంచి ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలకు మినహాయింపు కల్పించాలని డీజీసీఏను కోరింది. దీని పట్ల డీజీసీఏ ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఇది నియంతృత్వపు మోడల్ ఫలితం

ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమానాల రద్దు అంశంపై తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వపు నియంతృత్వపు మోడల్ ఫలితమని వ్యాఖ్యానించారు. న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే ఇటువంటి గందరగోళం ఏర్పడిందని ఆయన విమర్శించారు. రాజ్యసభలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ ప్రియాంకా చతుర్వేది నిబంధన 180 కింద నోటీసు ఇవ్వడంతో పాటు పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రయాణికుల భద్రత, సౌకర్యం ప్రమాదంలో పడటం అత్యంత ముఖ్యమైన అంశమని ఆయ‌న పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.