epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం

అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం
సమావేశాల బీఆర్ ఎస్ బ‌హిష్క‌రించ‌డంపై భిన్న వాద‌న‌లు
‘ఒక అంశాన్ని సాకుగా చూపి సభ బాయ్‌కాట్ ఎందుకు?’
అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన విషయాలు బయటే చర్చా?
కాంగ్రెస్–బీఆర్‌ఎస్ నేత‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు
నదీజలాలపై ఎవరి ప్రజెంటేషన్ వారిదే!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనసభ సమావేశాలను బీఆర్‌ఎస్ బహిష్కరించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్… సభలో వాకౌట్ చేసి పూర్తిస్థాయిలో బాయ్‌కాట్‌కు దిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ వాదన భిన్నంగా ఉంది. ఒకే అంశాన్ని సాకుగా చూపి మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మూసీ ప్రక్షాళన అంశంపై మైక్ ఇవ్వలేదన్న కారణాన్ని చూపిస్తూ సభకు దూరంగా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక అంశంపై మాట్లాడనివ్వలేదని చెబుతూ… మిగతా ప్రజా సమస్యలపై ఎందుకు చర్చించకూడదని కాంగ్రెస్ నిలదీస్తోంది. బీఆర్‌ఎస్ లొసుగులు బయటపడతాయన్న భయంతోనే అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటోందని ఆరోపిస్తోంది.

నదీజలాలపై రెండు వేదికలు

కృష్ణా జలాల వాటాపై రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండనున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ తరఫున హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో వేరు ప్రజెంటేషన్ ఇస్తారంటూ ప్రకటన చేశారు. నదీజలాల వంటి కీలక అంశంపై అసెంబ్లీ వేదికను వదిలేసి… ఎవరి వేదికల్లో వారు ప్రజెంటేషన్లు ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నదీజలాల అంశంపై రాజకీయ రగడ మొదలుపెట్టింది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నేనని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. అలాంటప్పుడు అదే అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించకుండా బయట రాజకీయాలు చేయడం ఏమిటని నిలదీస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ఆయనతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ సభకు రాకుండా బయట నుంచే పోరాటం చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తోంది.

‘సభలోనే ప్రశ్నించండి’

బయట ప్రశ్నించే అంశాలన్నింటినీ అసెంబ్లీలోనే ప్రశ్నిస్తే ప్రజలకు స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే సభలోనే నిలదీయాలని, అందుకు సిద్ధమేనని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కానీ అసెంబ్లీకి రావడానికి బీఆర్‌ఎస్ సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్యగా మారిందని వ్యాఖ్యానిస్తోంది. మొత్తానికి నదీజలాల అంశంపై ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారింది. శాసనసభ వేదిక ఖాళీగానే ఉండగా… రాజకీయ పోరాటం మాత్రం బయట ముదురుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.