epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్
అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలు
రియల్ కరెన్సీ చరిత్రలోనే కనిష్ఠానికి పతనం
పోర్టుల్లోనే రూ.2,000 కోట్ల బాస్మతి నిల్వ
పంజాబ్–హర్యానా రైతులకు ధరల ముప్పు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఇరాన్‌పై అమెరికా, ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌లో కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో, భారత్ నుంచి జరిగే ప్రీమియం బాస్మతి బియ్యం సరఫరాకు మరోసారి అనిశ్చితి నెలకొంది. అణు, క్షిపణి కార్యక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రాంతీయ అస్థిరతకు మద్దతు ఇస్తోందన్న ఆరోపణలతో విధించిన ఆంక్షల కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా ఇరానియన్ కరెన్సీ రియల్ పతనమై, ద్రవ్యోల్బణం 40 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.

రియల్ పతనమే ప్రధాన కారణం

ఇరాన్ రియల్ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు డాలర్‌కు సుమారు 90 వేల రియల్ ఉండగా, ప్రస్తుతం అది 1.50 లక్షలకు చేరింది. దీంతో ఆహార దిగుమతులు ఇరాన్‌కు భారంగా మారాయి. ఇంతకు ముందు ఆహార దిగుమతులకు డాలర్‌కు 28,500 రియల్ ప్రిఫరెన్షియల్ రేటుతో సబ్సిడీ ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం, తాజా సంక్షోభంతో ఆ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో భారతీయ ఎగుమతిదారులు సరుకులు పంపేందుకు వెనుకంజ వేస్తున్నారు.

పోర్టుల్లోనే బాస్మతి నిల్వ

ఈ పరిణామాల కారణంగా కనీసం రూ.2,000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం అంతర్జాతీయ పోర్టుల్లోనే నిలిచిపోయినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. గతంలో భారత్–ఇరాన్ మధ్య వాణిజ్యం బార్టర్ విధానంలో సాగింది. అయితే భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడంతో ఆ విధానం కూడా నిలిచిపోయింది. ఇరాన్ భారత బాస్మతి బియ్యానికి అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం సగటున 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని, సుమారు రూ.12,000 కోట్ల విలువకు ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో దాదాపు 40 శాతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే సరఫరా అవుతుంది.

ఎగుమతుల్లో ఇదే విధంగా అనిశ్చితి కొనసాగితే, ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైస్ మిల్లర్లతో పాటు రాబోయే రోజుల్లో రైతులకు లభించే ధరలు కూడా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జూన్ 21 తర్వాత ఇరాన్ విదేశీ దిగుమతులను నిలిపివేసి సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభిస్తుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంతో ఈ సరఫరా చక్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.