epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం
మున్సిపాలిటీలకు నిధులు వ‌చ్చేలా చేస్తాం
అవసరమైతే సీఎస్సార్‌ నిధులు కూడా
కాంగ్రెస్ పాలనపై శ్వేతపత్రం డిమాండ్
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీయేనని ధీమా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : రాబోయే మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ—మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెడితే ఢిల్లీకి వెళ్లి నేరుగా ప్రధాని *నరేంద్ర మోదీ*ని కలిసి కేంద్రం నుంచి భారీ నిధులు తీసుకొస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధికి కేంద్ర నిధులతో పాటు అవసరమైతే సీఎస్సార్‌ వనరులనూ సమీకరిస్తామని, మాటలకన్నా పనితోనే పాలనకు ప్రమాణం చూపిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. నిజంగా దమ్ముంటే ఈ కాలంలో ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. “జై శ్రీరాం” నినాదానికే కాంగ్రెస్ వణుకుతోందని, ప్రజలే స్వయంగా బీజేపీకి ఆ నినాదంతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు.

అసలు పోటీ కాంగ్రెస్–బీజేపీ మధ్యే

క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలహీనమైందని, ఈ ఎన్నికల్లో అసలైన పోటీ కాంగ్రెస్–బీజేపీ మధ్యేనని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో సర్వేలను ఆధారంగా తీసుకోవాలని, గెలిచే అవకాశమున్న కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని సూచించారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో ఎంఐఎంకు లాభం చేకూర్చేలా కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. కరీంనగర్ నుంచి నిర్మల్ వరకూ మజ్లిస్‌తో ఒప్పందాల మాటలు వినిపిస్తున్నాయని, ఈ కుట్రలను బీజేపీ చిత్తు చేస్తుందని స్పష్టం చేశారు.

ప్రజాబలంతోనే బీజేపీ బరిలోకి

కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బును నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నాయని, బీజేపీ మాత్రం ప్రజలనే నమ్ముకుని బరిలోకి దిగుతోందన్నారు. అభివృద్ధి, ప్రజాసమస్యలు, హిందుత్వమే బీజేపీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. పోలింగ్ వరకు కార్యకర్తలు ఒక్కో ఇంటికి కనీసం ఆరు సార్లు వెళ్లి ప్రజలకు నేరుగా భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని, పార్టీ పదవులు లేదా నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.