epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లేఔట్ అనుమతుల్లో నిబంధనలు తప్పనిసరి

లేఔట్ అనుమతుల్లో నిబంధనలు తప్పనిసరి
అప్రోచ్ రోడ్డు లేకుంటే లేఔట్‌కు అనుమతి లేదు
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అనుమతులు నిషేధం
పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టీక‌ర‌ణ‌
జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : లేఔట్ అనుమతుల జారీలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల మేరకే అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న లేఔట్ దరఖాస్తులపై సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించిన అభ్యంతరాలు, శాఖల రిమార్క్స్‌ను అడిగి తెలుసుకుని పలు కీలక సూచనలు చేశారు. అనుమతుల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో 12 డ్రాఫ్ట్ లేఔట్‌లు, 4 ఫైనల్ లేఔట్‌లను కమిటీ పరిశీలించిందని తెలిపారు. లేఔట్‌లకు అనుమతులు ఇచ్చే సమయంలో నీటి వనరులు, చెరువులు, వాగుల ఎఫ్‌టీఎల్ పరిధిలోకి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అనుమతులు వద్దు
లేఔట్ ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ బాడీల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉండకూడదని కలెక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నీటి ప్రవాహ మార్గాలు, సహజ జల వనరులకు ఆటంకం కలిగేలా ఎలాంటి అనుమతులు జారీ చేయరాదన్నారు. లేఔట్‌లో అప్రోచ్ రోడ్డు తప్పనిసరిగా 18 మీటర్ల వెడల్పుతో ఉండాలని స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి కేటాయింపులు లేఔట్ ప్లాన్‌లో స్పష్టంగా చూపించాలన్నారు. ఈ అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.

సర్వే నివేదికలు తప్పనిసరి
ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మండల సర్వేయర్లు, ఆర్డీవోలు సంయుక్తంగా లేఔట్ దరఖాస్తులను పరిశీలించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని కలెక్టర్ సూచించారు. చుట్టుపక్కల సర్వే నంబర్లు, భూమి స్వరూపం, గతంలో అక్కడ నీటి వనరులు ఉన్నాయా లేదా అనే అంశాలను సాంకేతిక పద్ధతుల్లో పరిశీలించాలని ఆదేశించారు. లేఔట్ ప్రాంతాల్లో గతంలో చెరువులు, వాగులు లేదా నీటి నిల్వ ప్రాంతాలు ఉన్నాయా అనే విషయాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్ధారించాలని చెప్పారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా పూర్తి స్థాయిలో ధృవీకరణ చేసిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. లేఔట్ అనుమతుల జారీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, నిబంధనలకు లోబడి మాత్రమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అభివృద్ధి సమయంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అక్రమ లేఔట్‌లు, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ నాణ్యమైన పట్టణాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ ఎం. రాజేశ్వరి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్, ఏదులాపురం టౌన్ ప్లానింగ్ అధికారి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస రెడ్డి, డీఈ రాజేష్, తహసీల్దార్లు రాంప్రసాద్, సైదులు, శ్వేత, అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.