epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాజ‌కీయాల్లో ధ‌న ప్ర‌వాహం ఎక్కువ‌వుతోంది..!

రాజ‌కీయాల్లో ధ‌న ప్ర‌వాహం ఎక్కువ‌వుతోంది..!
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
డబ్బు ప్రభావంతో విలువ కోల్పోతున్న ప్రజాస్వామ్యం
ఓటుకు 6 వేల నుంచి 10 వేల వరకు పంపకాలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ 52వ డివిజన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత అని పేర్కొన్న గంగుల, ప్రస్తుత పరిస్థితులు ఆ హక్కు విలువను తగ్గించేలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ప్రతి ఎన్నికలో పోలింగ్ శాతం సాధారణంగా 50 నుంచి 60 శాతం మధ్యే నమోదవుతుందని గుర్తు చేస్తూ, ఈసారి మాత్రం ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పనిచేసే నిజాయితీ గల నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. అయితే ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం బహిరంగంగానే కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

ఓటుకు నోటు – ప్రమాదకర ధోరణి

ఒక్కో ఓటుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బు పంపిణీ జరుగుతోందన్న సమాచారం తనకు అందిందని గంగుల వెల్లడించారు. ఒకే డివిజన్‌లో అభ్యర్థి సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పదవి అంటే సేవ చేయడం అని, అలాంటిది ఇంత భారీగా ఖర్చు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శుభసూచకం కాదని, తన 27 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి దుస్థితిని ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. డబ్బు ఆధారంగా గెలిచినా అభివృద్ధి చేయాలన్న సంకల్పం లేకపోతే ప్రజలకు ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పదవీకాలం తర్వాత ప్రజలకు లాభం చేకూర్చే నాయకత్వమే అవసరమని సూచించారు.

కరీంనగర్‌లో హంగ్ పరిస్థితి?

కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రను ప్రస్తావిస్తూ, ఎక్కువసార్లు కూటముల ఆధారంగానే నాయకత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని ఎన్నికల్లో ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో స్పష్టమైన నమ్మకం కనిపించడం లేదని, అందువల్ల ఈసారి ఏ పార్టీకి కూడా 34 స్థానాల స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశాలు లేవని అంచనా వేశారు. ప్రధాన పార్టీలు గరిష్ఠంగా 20 నుంచి 21 స్థానాల వరకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఎవరైనా మేయర్‌గా ఎన్నికైనా బాధ్యతతో పనిచేయాలని, భారీగా ఖర్చు పెట్టి గెలిచామనే భావనతో కాకుండా నగరాభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కరీంనగర్ ప్రజలు తమ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓటు వేయాలని గంగుల విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.