epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొత్తగూడెం కార్పొరేషన్‌లో హోరాహోరీ

కొత్తగూడెం కార్పొరేషన్‌లో హోరాహోరీ
కాంగ్రెస్–సీపీఐ సమాన సీట్లు
మేయర్ పీఠంపై ఉత్కంఠ
కూటమి లేకుండానే పోటీ చేసిన ప్రధాన పార్టీలు

కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఉత్కంఠ రేపాయి. మొత్తం 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు చెరో 22 స్థానాలు గెలుచుకుని సమానంగా నిలిచాయి. దీంతో కార్పొరేషన్‌లో ఆధిపత్యం ఎవరిదనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇతర పార్టీలైన బీఆర్ఎస్ 8, సీపీఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 6 స్థానాలు గెలుచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి 22 డివిజన్లలో విజయం లభించగా, సీపీఎం మద్దతుతో మరో ఒక డివిజన్‌లో గెలుపొందడంతో కాంగ్రెస్ బలం 23కు చేరింది. సీపీఐ కూడా 22 డివిజన్లలో గెలిచి గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ 8 స్థానాలకు పరిమితమవగా, సీపీఎం, బీజేపీ చెరో ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు 6 డివిజన్లలో విజయం సాధించి కీలకంగా మారారు.

కూటమి లేకుండా పోటీ… ఫలితాల్లో సమాన సీట్లు

కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్–సీపీఐ కూటమి ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ, చివరకు రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. సీపీఐ తరఫున జాతీయ నాయకుడు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కార్మిక సంఘాల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం ఫలితంగా సీపీఐ 22 స్థానాలు గెలుచుకుని తన బలాన్ని నిరూపించింది. ఇక కాంగ్రెస్ తరఫున రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం వల్ల కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలతో రెండు పార్టీల శ్రేణుల్లో సంబరాలు కనిపించాయి.

మేయర్ పీఠంపై ఉత్కంఠ

కాంగ్రెస్, సీపీఐ సమానంగా సీట్లు సాధించడంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందనే అంశం కీలకంగా మారింది. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల మద్దతు ఎవరికివస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్‌లో సంఖ్యాబలం సమానంగా ఉండటంతో మేయర్ ఎన్నిక వరకు రాజకీయ చర్చలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం అధికార పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.