epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తీర్థల జాతరలో ట్రాఫిక్ నరకం…

తీర్థల జాతరలో ట్రాఫిక్ నరకం…
ఎండలో కుప్పకూలిన భక్తులు!
మహాశివరాత్రి జాతరకు పోటెత్తిన భక్తజనం
కిలోమీటర్ మేర స్తంభించిన ట్రాఫిక్… గంటన్నర నరకయాతన
ఎండ తీవ్రతకు సొమ్మ‌సిల్లిన‌ మహిళలు, చిన్నారులు
చేతులెత్తేసిన పోలీసులు… కనిపించని ప్రజాప్రతినిధులు
కంకర రోడ్లతో దుమ్ముదూళి… వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
ముందస్తు చర్యల లోపంపై అధికార యంత్రాంగంపై విమర్శలు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం రూరల్ మండలం తీర్థల జాతరలో ఆదివారం ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రహదారులన్నీ వాహనాలు, జనంతో కిక్కిరిసిపోయాయి. జాతర చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో భక్తులు తరలివచ్చినప్పటికీ, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతర ప్రాంతానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో వాహనాలు ఎదురెదురుగా నిలిచిపోవడంతో దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. భక్తులు నడిచేందుకు కూడా వీలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు తగిన పోలీసు బలగాలు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.

ఎండలో కుప్పకూలిన మహిళలు, చిన్నారులు

మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దాదాపు గంటన్నర పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎండ తీవ్రతను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వాహనాల్లో చిక్కుకుపోయిన కుటుంబాలు నీరు, నీడ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఉన్న కొద్దిమంది ట్రాఫిక్ సిబ్బంది, హోంగార్డులు కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేక చేతులెత్తేశారు. కొంతమంది పోలీసులు చెట్ల నీడలో, టెంట్ల కింద ఉండిపోయారని భక్తులు ఆరోపించారు.

కంకర రోడ్లతో దుమ్ముదూళి… ప్రమాదకర పరిస్థితులు

పల్లెగూడెం నుంచి తీర్థల జాతర వరకు రహదారిపై కంకర, గ్రావెల్, మట్టి పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు వెళ్లిన ప్రతిసారి దుమ్ముదూళి భారీగా ఎగసిపడడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు ద్విచక్ర వాహనదారులు కంకర రాళ్లపై జారి కిందపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిడ్జి కింద వన్‌వే మార్గం ఏర్పాటు చేసినప్పటికీ, దాన్ని సక్రమంగా అమలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దుమ్ము తగ్గించేందుకు రోడ్డుపై నీళ్లు చల్లే చర్యలు కూడా చేపట్టకపోవడం భక్తుల్లో అసంతృప్తి కలిగించింది.

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారని ముందుగానే తెలిసినా, తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. గతంలో పలువురు ఎమ్మెల్యేల హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని, ప్రస్తుతం మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడిన పలువురు మహిళలు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర వంటి భారీ కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళిక, తగిన పోలీసు బలగాలు, రహదారి సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.