epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొత్త‌గూడెం మేయ‌ర్‌గా మూడ్ గణేష్

కొత్త‌గూడెం మేయ‌ర్‌గా మూడ్ గణేష్
మేయర్ పీఠం సీపీఐ ఖాతాలో
కాంగ్రెస్–సీపీఐ పొత్తులో భాగంగా మేయర్ పదవి సీపీఐకి కేటాయింపు
మేయర్‌గా సీపీఐ నేత మూడ్ గణేష్ పేరు అధికారికంగా ఖరారు
మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు
కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ ఎంపికకు కసరత్తు పూర్తి
కొత్త కార్పొరేషన్‌లో తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న గణేష్

కాకతీయ, కొత్తగూడెం రూర‌ల్ : కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠం సీపీఐ ఖాతాలోకి వెళ్లింది. కాంగ్రెస్–సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన మేయర్ పదవికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు మూడ్ గణేష్ పేరును అధికారికంగా ఖరారు చేశారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ తొలి మేయర్‌గా మూడ్ గణేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 13న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్–సీపీఐ కూటమి ఆధిక్యం సాధించింది. ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం మేయర్ పదవిని సీపీఐకి కేటాయించారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం మూడ్ గణేష్ పేరును ఖరారు చేసింది. ఆయన అనుభవం, సమన్వయ నాయకత్వం, ప్రజలలో ఉన్న మంచి పేరు కారణంగా ఎంపికకు విశేష స్పందన లభిస్తోంది.

కీలక నేతల సమక్షంలో ఎన్నిక ప్రక్రియ

మేయర్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కే సబీర్ పాషా తదితర నాయకులు ఫిబ్రవరి 16న కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పొత్తు ఒప్పందంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి కేటాయించినట్లు సమాచారం. ఈ పదవికి సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై చర్చలు పూర్తి చేసినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబరాల్లో మునిగిపోయిన కూటమి శ్రేణులు

మేయర్‌గా మూడ్ గణేష్ ఎంపిక ఖరారవడంతో కాంగ్రెస్, సీపీఐ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్‌లో తొలి మేయర్ బాధ్యతలు సీపీఐకి దక్కడం చారిత్రాత్మక ఘట్టంగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కొత్తగూడెం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.