epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”
ప్రజలు ఆకలిని సహించినా ఆధిపత్యాన్ని ఒప్పుకోరు
అమ‌ర‌వీరుల స్ఫూర్తితో విధులు కొన‌సాగించాలి
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి అవగాహన ఉన్నవారినే చైర్మన్ చేశాం
15 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పోస్టులు భర్తీ
పదవితో వ్యక్తిత్వం కోల్పోవద్దు.. పాల‌న‌లో పారదర్శకత పాటిద్దాం
ప్రజలకు సంక్షేమం చేరేలా పని చేయాలి
గ్రూప్–1, గ్రూప్–2 అధికారులకు సీఎం భావోద్వేగ సందేశం
శిక్షణను పూర్తి చేసుకున్న అధికారులకు అభినంద‌న‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : గ్రూప్–1, గ్రూప్–2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగభరితంగా ప్రసంగించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అధికారులను అభినందిస్తూ “మీరు మొన్న విద్యార్థులు… నిన్న నిరుద్యోగులు… ఈ రోజు అధికారులు. ఇది మీ కృషి, మీ కుటుంబాల త్యాగాల ఫలితం” అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సేవ చేసే బాధ్యత మీ భుజాలపై ఉందని గుర్తుచేస్తూ పారదర్శకత, నిబద్ధత, కర్తవ్యబోధతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఆకలిని సహించినా ఆధిపత్యాన్ని ఒప్పుకోరని స్పష్టం చేసిన సీఎం, స్వాతంత్ర్యం, స్వాభిమానం కోసం పోరాడిన వీరులను స్మరించారు. రాంజీ గోండు, కొమరం భీం రాజ్యాల కోసం కాదు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. కాకతీయ కాలంలో సమ్మక్క, సారలమ్మ సామాజిక న్యాయం కోసం తిరుగుబాటు చేసి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం అమరవీరులైన వారి స్ఫూర్తి అధికారుల పనితీరులో ప్రతిబింబించాలని సూచించారు. దేశంలో తొలి సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన తెలంగాణ బిడ్డ రావి నారాయణ రెడ్డిని ఉదాహరణగా పేర్కొంటూ ప్రజల ఆశయాలకు ప్రతీకగా నిలిచిన నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షల కోసం సుమారు ఆరు లక్షల మంది పోటీపడగా 582 మంది గ్రూప్–1, 775 మంది గ్రూప్–2 అభ్యర్థులు మాత్రమే ఎంపిక కావడం సాధారణ విషయం కాదని, ఇది మీ ప్రతిభ, పట్టుదల ఫలితమని అభినందించారు.

15 ఏళ్ల తర్వాత గ్రూప్–1 భర్తీ

గత 15 ఏళ్లుగా గ్రూప్–1 పోస్టులు భర్తీ కాలేదని గుర్తుచేసిన సీఎం, ప్రజా ప్రభుత్వం ఆ లోటును తీర్చిందన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ పరీక్షలపై అవగాహన ఉన్నవారినే చైర్మన్, సభ్యులుగా నియమించామని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు పేర్కొన్నారు. గ్రూప్–1లో ఎంపికైన అభ్యర్థుల ఆనందం నిలవకుండా కొందరు కోర్టులకు వెళ్లినా, ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు పోరాడి మెరిట్ ఆధారంగా ఎంపికలను నిలబెట్టిందన్నారు.
అధికారులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని సీఎం హెచ్చరించారు. పదవి వచ్చిన తర్వాత మనిషిగా పతనం కాకూడదన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా చేరేలా చూడాల్సిన బాధ్యత మీది అని స్పష్టం చేస్తూ “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు” అని పేర్కొన్నారు. ప్రజాసేవకు ఆదర్శంగా నిలిచిన ఎస్.ఆర్. శంకరన్‌ను తలచుకోవాలని సూచించారు. పేదలకు సహాయం చేసే ముందు తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలని, వారిని గౌరవించాలని అన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 10–15 శాతం కోత పెట్టేలా చట్టం తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉందని వెల్లడించారు. త్వరలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఎంసీఆర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదరబోతుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పరిపాలన నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలను అధికారులు వినియోగించుకోవాలని సూచించారు. ముగింపులో, ప్రజల ఆశలు, అమరవీరుల స్ఫూర్తి, తల్లిదండ్రుల ఆశీర్వాదాలను గుర్తు పెట్టుకుని పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా సేవ చేయడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెంచాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.