epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌
పాల‌సీ డ‌బ్బులు కాజేసేందుకు ప‌క్కా ప్లాన్‌తో మ‌ర్డ‌ర్‌
హ‌త్య‌ను ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు య‌త్నం
బ‌తుకు కోరాల్సిన బావ‌మ‌రిదే అంతం చేశాడు
ఇన్సూరెన్స్ హ‌త్య‌ల ముఠాకు స‌హ‌క‌రించిన భార్య‌
ఖ‌మ్మం గాంధీన‌గ‌ర్ ఘ‌ట‌న‌లో నలుగురు అరెస్ట్.. పరారీలో భార్య‌
కారుతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం.. ఖ‌మ్మం రూర‌ల్ మండ‌ల ప‌రిధిలో సంచ‌ల‌న ఘ‌ట‌న‌

కాకతీయ, కూసుమంచి : ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు దక్కించుకోవాలనే దురాశ ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంగా చూపించి తప్పించుకోవాలని వేసిన పక్కా పథకం చివరకు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఖమ్మం జిల్లా ఖ‌మ్మం రూర‌ల్ మండ‌ల ప‌రిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి పేరు మీద అతని బావమరిది దేశపోయిన శ్రీనివాస్ భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. సుమారు 66 లక్షల రూపాయల పాలసీ డబ్బులు దక్కించుకోవాలనే ఆశతో హత్యకు పక్కా పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల రెండో తేదీ రాత్రి సుమారు 8 గంటల 30 నిమిషాల సమయంలో రవిని మద్యం సేవిద్దామని చెప్పి దేశపోయిన శ్రీనివాస్ తన ఆటోలో బయటకు తీసుకెళ్లాడు. వెంకటయ్యపాలెం శివారుకు తీసుకెళ్లి మద్యం మత్తులో ఉన్న రవిని అక్కడ దించి వెళ్లిపోయాడు.

కారుతో ఢీకొట్టి హత్య

ముందే పథకం ప్రకారం అక్కడికి వచ్చిన జోగి రాజ్‌కుమార్ మహేంద్ర ఎక్స్‌యువి కారుతో నడుచుకుంటూ వెళ్తున్న రవిని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా దేశపోయిన శ్రీనివాస్, జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబు ఉన్నారు. మృతుడి భార్య చాగంటి ప్రశాంతి కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. హత్య అనంతరం ప్రమాదానికి గురైన కారును తనగంపాడు గ్రామంలోని ఓ ఇంట్లో కవర్లతో కప్పి దాచిపెట్టినట్లు విచారణలో తేలింది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన కారుతో పాటు నిందితుల సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలోనే ఈ క్లిష్టమైన హత్య కేసును ఛేదించిన ఖమ్మం రూరల్ పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.