epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం

ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం
స్పీకర్ తీర్పు.. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం
బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ఆగ్ర‌హం
రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆరు నెలల లోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం రాష్ట్ర ప్రజలందరూ చూసిన విషయమని అన్నారు. ఇంత స్పష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని చెప్పడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరో పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం, అదే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం వంటి స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ కూడా ఇది పార్టీ ఫిరాయింపు కాదని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అవమానించే తీర్పని రాంచందర్ రావు అన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచినట్టేనని విమర్శించారు. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. కాబట్టి ఈ అంశంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అదే యాంటీ డిఫెక్షన్ చట్టం స్పష్టంగా ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితుల్లో స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కినట్టేనని ఆయన అన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటూ మరోవైపు పార్టీ నాయకుల చర్యలను సమర్థించే పరిస్థితి ఎందుకు వస్తోందని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని మరియు ప్రజల తీర్పును కూడా అవమానించిందని పేర్కొంటూ బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.