epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

శంషాబాద్ టు కిమ్స్ ఆసుపత్రి
గ్రీన్ ఛానెల్ ద్వారా తరలింపు
ప్రాణదాతగా మారిన ట్రాఫిక్ విభాగం
పోలీసుల ప‌నితీరుపై స‌ర్వ‌త్ర ప్ర‌శంస‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బెంగళూరు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అత్యవసరంగా ఊపిరితిత్తులను తరలించేందుకు హైదరాబాద్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆసుపత్రి వరకు ఉన్న భారీ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ.. ప్రత్యేక అంబులెన్స్‌కు మార్గం సుగమం చేశారు. డాక్టర్ల బృందం సకాలంలో అవయవాలను ఆసుపత్రికి చేర్చడంతో.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి శస్త్రచికిత్స చేసేందుకు వీలు కలిగింది. పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి కీలకంగా వ్యవహరించారు . బెంగళూరులో సేకరించిన ఊపిరితిత్తులను అత్యవసర చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. సాధారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే భారీ ట్రాఫిక్ కారణంగా గంటల సమయం పడుతుంది. కానీ.. అవయవ మార్పిడి చికిత్సలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది కావడంతో డాక్టర్లు వెంటనే నగర ట్రాఫిక్ పోలీసుల సహాయాన్ని కోరారు.

తక్షణమే స్పందించిన ట్రాఫిక్ విభాగం

దీంతో తక్షణమే స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పోలీసులు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు దాదాపు 35 కిలోమీటర్ల మేర ‘గ్రీన్ ఛానెల్ ‘ ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న డాక్టర్ల బృందం.. మధ్యాహ్నం సమయంలో ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్‌లోకి మార్చింది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అంబులెన్స్ వెళ్లే దారిలో ఉన్న అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను ఆపివేసి.. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో అంబులెన్స్ వాయు వేగంతో సురక్షితంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. ఈ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు కేసం సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పనిచేశారు. ఊపిరితిత్తులు సకాలంలో ఆసుపత్రికి చేరడంతో కిమ్స్ డాక్టర్లు వెంటనే శస్త్రచికిత్సను ప్రారంభించారు. ఈ తరలింపు సాఫీగా సాగేలా పైలట్ వాహనాలు అంబులెన్స్‌కు ముందు వెనకా ఏర్పాటు చేశారు.

గ‌తంలోనూ ప‌లుమార్లు..

గుండె, కాలేయం వంటి అవయవాలను తరలించేందుకు పోలీసులు ఇలాంటి గ్రీన్ ఛానెల్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా.. అత్యవసర వైద్య సేవల కోసం పోలీసులు చూపుతున్న ఈ చొరవను నగరవాసులు, రోగి బంధువులు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న పోలీసుల కృషి వల్ల ఒక నిండు ప్రాణం నిలబడబోతోందని డాక్టర్లు తెలుపుతున్నారు. ఈ రకమైన వేగవంతమైన రవాణా వ్యవస్థలు అవయవ దాన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.