ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్ పట్టణ ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు, పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సామాజిక వర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. భగత్‌నగర్‌లో పెద్దమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చేసిన కృషిని గుర్తుచేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ బీజేపీ ముగ్గురు అభ్యర్థులకు కార్పొరేటర్ టికెట్లు కేటాయించిన విషయాన్ని పేర్కొన్నారు. ముదిరాజ్ సోదరులు ఐక్యతతో ఉండి సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని, సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొలకాని నర్సయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పండుగ నాగరాజు, గౌరవ అధ్యక్షుడు పిట్టల లింగయ్యతో పాటు ఇతర పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు పొన్నం లక్ష్మి-మొండయ్య, చొప్పరి జయశ్రీ-వేణు, ముదిరాజ్ సంఘం సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

