జాగృతి పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి
కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
జిల్లా నుంచి భారీగా సమీకరణకు కార్యాచరణ
మండలాల వారీగా బాధ్యతల కేటాయింపు
కాకతీయ, కరీంనగర్ : కవిత నాయకత్వంలో జాగృతి రాజకీయ పార్టీగా మారుతున్న వేళ కరీంనగర్ జిల్లా నుంచి భారీగా హాజరై మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25న జరగనున్న జాగృతి పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని నాయకులు నిర్ణయించారు. జిల్లాలోని మండలాల వారీగా నాయకులకు బాధ్యతలు కేటాయించి జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 2000 మందిని సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు.
జాగృతి పోరాటాల దిశలోనే ముందుకు
ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ జాగృతి సంస్థగా ఉన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉందన్నారు. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత కూడా అదే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణతో పాటు కరీంనగర్ జిల్లా సమస్యల పరిష్కారానికి కవిత నాయకత్వంలో కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, నాయకులు చంటి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, బండమీద అంజయ్య, తోగోటి తిరుపతి, గాలిపల్లి రత్నాకర చారి, ఎండి సల్మా, జంగా అపర్ణ సాగర్, కుతాడి రజిత, పల్లె శారద, మ్యక వినోద్, ఎండి రజి, బత్తిని సాగర్ గౌడ్, గువ్వ శ్రీనివాస్, కాంతాల రోజా రెడ్డి, కొలిపాక గౌతమి, యండి అసియా సుల్తానా, గాజుల నవ్య, పుల్లురి అంజలి, గర్శకుర్తి విద్యాసాగర్, సిపెళ్లి వెంకటేష్, బండ అశోక్, దిటి శిరిష రమేష్, వొద్దుల వాణి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

