epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అశాస్త్రీయ కోర్సులు తొలగించాలి

అశాస్త్రీయ కోర్సులు తొలగించాలి
ప్రజానుకూల విద్యావిధానం అవసరం
జెవివి విద్యాసదస్సులో వక్తల డిమాండ్
ఎన్‌ఈపీ విధానంపై తీవ్ర విమర్శలు
కామన్ స్కూల్ విధానం అమలు చేయాలన్న ప్రతిపాదన
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్

కాకతీయ, ఖమ్మం : ఉన్నత విద్యలో అశాస్త్రీయమైన కోర్సులను పూర్తిగా తొలగించి శాస్త్రీయ దృక్పథంపై ఆధారపడిన ప్రజానుకూల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని జెవివి రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్ పేర్కొన్నారు. ఖమ్మంలోని డిపిఆర్‌సి భవన్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన అధ్యక్షత వహించారు. ఎన్‌ఈపీ-2020, ఉన్నత విద్యలో జరుగుతున్న మార్పులు, పాఠ్యాంశాల రూపకల్పనపై జరిగిన చర్చల్లో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయంగా నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వల్ల ధనిక విద్యార్థులకు మాత్రమే ఉన్నత విద్య అందుబాటులోకి వస్తోందని వక్తలు అభిప్రాయపడ్డారు. గ్రేడింగ్ విధానం కారణంగా డిగ్రీ కోర్సులు నాలుగేళ్లకు పొడిగించడం సరైన పద్ధతి కాదని, దీని వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని సూచించారు.

ఎన్‌ఈపీపై విమర్శలు

ఎన్‌సిఈఆర్‌టి పాఠ్యపుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం, పిరియాడిక్ టేబుల్, జెనటిక్స్ వంటి ప్రాథమిక శాస్త్రీయ అంశాలను తొలగించడం సరైంది కాదని, చరిత్రలో కొన్ని కీలక భాగాలను తొలగించి అశాస్త్రీయ అంశాలను చేర్చడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. దేశంలో ఇంకా కోట్లాది మంది నిరక్షరాస్యులు ఉన్నప్పటికీ వారిని అక్షరాస్యులుగా మార్చే దిశగా ప్రభుత్వం సమగ్ర కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రీ ప్రైమరీ స్థాయిలో పిల్లల మానసిక వికాసానికి అనుగుణంగా విద్య ఉండాలని, పోటీ తత్వం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో బాల్య దశ నుంచి ఉన్నత విద్య వరకు ఉచిత, నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించాలని, విద్యలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని, జిడిపిలో కనీసం ఆరు శాతం నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. ఎన్‌ఈపీ-2020ను రద్దు చేసి రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని, ఎన్‌సిఈఆర్‌టి పాఠ్యపుస్తకాలను స్వతంత్ర విద్యావేత్తలతో పునర్నిర్మించాలని సూచించారు. ఉపాధ్యాయ నియామకాలు పెంచి వారి పై భారం తగ్గించాలని, సమాజ ఆధారిత అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేసి సమాన విద్యావకాశాలు కల్పించాలని సదస్సు స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అందె సత్యం, కోయ కోటేశ్వరరావు, ఎడమ శ్రీనివాసరెడ్డి, రాజా, అలవాల నాగేశ్వరరావు, శివన్నారాయణ, ఎల్‌వి రెడ్డి, అరుణశ్రీ, మల్లెంపాటి వీరభద్రరావు, వంజాకు లక్ష్మీనారాయణ, వి.మోహన్, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.