అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్ల పంపిణీ
కాకతీయ, చెన్నూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడి టీచర్లకు అందిస్తున్న సెల్ ఫోన్లను చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మంగళవారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ప్రజా పాలన అందుతుందని,ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అనంతరం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్మ సుగుణాకర్,సురేందర్ తండ్రి రామయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐ.ఎన్.టీ.యూ.సి సీనియర్ నాయకుడు తేజవత్ రాంబాబుతో మంత్రి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

