epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి సంపద

ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి సంపద
పోషకాహార లోప రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
అదనపు కలెక్టర్ విద్యాచందన
ఘనంగా పోషణ పక్వాడ ముగింపు వేడుకలు

కాకతీయ, కొత్తగూడెం: ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి నిజమైన సంపద అని, మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడిగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘పోషణ పక్వాడ – 2026’ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పోషణ పక్వాడ స్ఫూర్తిని కేవలం 15 రోజులకే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా కొనసాగించాలని సూచించారు. 2026 నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, విటమిన్లు, ఖనిజాలు అందేలా అవగాహన కల్పించాలని కోరారు.

తల్లి గర్భం నుంచే ఆరోగ్యం..
జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత లేనినా మాట్లాడుతూ.. జిల్లాలోని 2061 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార విలువలపై విస్తృత అవగాహన కల్పించామన్నారు. బిడ్డ ఆరోగ్యం తల్లి గర్భం నుంచే మొదలవుతుందని, గర్భిణులు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లతో పాటు బలమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వడం వల్ల బిడ్డకు జీవితాంతం అవసరమైన రోగనిరోధక శక్తి లభిస్తుందని పేర్కొన్నారు.

వేడుకగా గ్రాడ్యుయేషన్ డే..
కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతాలు జరిపించారు. పోషణ పక్వాడలో ప్రతిభ కనబరిచిన సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు మరియు పోషణ అభియాన్ సిబ్బందికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత, వైద్య అధికారులు సతీష్, డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.