epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేరుకే ‘గ్రామీణ’.. రైతుకు తప్పని వడ్డీ వడ్డింపు!

పేరుకే ‘గ్రామీణ’.. రైతుకు తప్పని వడ్డీ వడ్డింపు!
రెన్యువల్ పేరిట అదనపు బాదుడు..
ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ చార్జీల మోత
కేంద్రం ఇచ్చే రిబేటుపై న‌మ్మ‌కం లేని బ్యాంకు
షెడ్యూల్డ్ బ్యాంకులతో పొంతన ఏది?
ఖాతాదారులకు తెలియకుండానే ‘ఇన్సూరెన్స్’ కటింగ్
చింతకాని మండ‌లంలో అన్నదాతల ఆవేదన

కాకతీయ, చింతకాని : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన గ్రామీణ బ్యాంకులు.. క్షేత్రస్థాయిలో మాత్రం అన్నదాతల పాలిట భారంగా మారుతున్నాయి. ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాలు పొందిన రైతులు రెన్యువల్ సమయంలో అదనపు చార్జీల బాదుడుతో బెంబేలెత్తుతున్నారు. ఒకే రకమైన వ్యవసాయ రుణాలకు షెడ్యూల్డ్ జాతీయ బ్యాంకులు ఒకలా.. గ్రామీణ బ్యాంకులు మరోలా వ్యవహరిస్తుండటంతో రైతులు నిండా మునుగుతున్నారు.

అదనపు చార్జీల మోత.. రూ.3,800 కట్!

సాధారణంగా సకాలంలో రుణం తీర్చే రైతులకు ఏడాదికి ప్రతి లక్షకు 7 శాతం వడ్డీ వసూలు చేస్తారు. అయితే గ్రామీణ బ్యాంకులో దీనికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌స్పెక్షన్ చార్జీల పేరిట ప్రతి లక్షకు రూ. 1,900 అదనంగా వసూలు చేస్తుండటం గమనార్హం. మండలంలోని ఒక రైతు తన రూ. 2 లక్షల రుణాన్ని రెన్యువల్ చేసుకోగా, బ్యాంకు అధికారులు వడ్డీతో సంబంధం లేకుండా ఏకంగా రూ. 3,800 చార్జీలుగా కట్ చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ బ్యాంకుల్లో ఈ తరహా భారం లేకపోవడంతో, గ్రామీణ బ్యాంకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.

రిబేటు ఎప్పుడు వస్తుందో.. రాదో?

కేంద్ర ప్రభుత్వం రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు అందించే ఉద్దేశంతో, రైతు చెల్లించిన 7 శాతం వడ్డీలో 3 శాతాన్ని రిబేటు రూపంలో తిరిగి ఇస్తుంది. జాతీయ బ్యాంకుల్లో ఈ నగదు వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతుండగా.. గ్రామీణ బ్యాంకులో మాత్రం ఏడాదైనా ఆచూకీ ఉండటం లేదు. బ్యాంకు అధికారులను అడిగితే “నాబార్డ్ నుంచి రావాలి.. మాకు తెలియదు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా 18 నెలల తర్వాత అరకొరగానే జమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

పరిధి పేరుతో రైతుల బందీ!

మరోవైపు, గ్రామీణ బ్యాంకుల దోపిడీ భరించలేక రైతులు జాతీయ బ్యాంకులకు వెళ్తే.. “ఆ గ్రామం మా పరిధిలోకి రాదు” అంటూ అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు ఇష్టం లేకపోయినా గ్రామీణ బ్యాంకులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇవే కాకుండా, ఖాతాదారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఎస్బీఐ ఇన్సూరెన్స్ వంటి ప్రీమియంలు కట్ చేస్తున్నారని, అడిగితే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. అన్ని బ్యాంకుల్లో రుణాల విధివిధానాలు ఒకేలా ఉండాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామీణ బ్యాంకుల అడ్డగోలు చార్జీలకు అడ్డుకట్ట వేయాలని చింతకాని మండల రైతాంగం డిమాండ్ చేస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.