epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘ఫిట్ ఇండియా’ సాధనకు ఓపెన్ జిమ్‌లు దోహదం

‘ఫిట్ ఇండియా’ సాధనకు ఓపెన్ జిమ్‌లు దోహదం
రూ. కోటితో 17 ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
నాల్కో సీఎస్సార్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ముందడుగు
కిసాన్‌నగర్, దుర్షేడులలో జిమ్‌లను ప్రారంభించిన కేంద్ర మంత్రి
కమాన్‌పూర్‌లో రూ. 20 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

కాకతీయ, కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా’ సాధనలో భాగంగా నగర ప్రజల శారీరక దృఢత్వం కోసం ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. నాల్కో సంస్థ సామాజిక బాధ్యత (సీఎస్సార్) నిధుల సహాయంతో, మలయప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో దాదాపు రూ. కోటి అంచనా వ్యయంతో 17 డివిజన్లలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కిసాన్‌నగర్ అంబేద్కర్ యూత్ క్లబ్ సమీపంలో, అలాగే దుర్షేడు గ్రామంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన రెండు ఓపెన్ జిమ్‌లను మంగళవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ స్థానిక ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలయప్ప ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ గడ్డం అరుంజయ్, గడ్డం అనూష మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేస్తూ ఈ జిమ్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిత్యం పనులతో బిజీగా ఉండే నగరవాసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నగరంలోని అన్ని 17 డివిజన్లలో త్వరలోనే ఈ జిమ్‌ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ సౌకర్యాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.

రూ. 20 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన:
ఓపెన్ జిమ్‌ల ప్రారంభోత్సవం అనంతరం కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత ఆరేళ్లుగా ఉపాధి హామీ పథకం ద్వారా వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులను వెచ్చించి మౌలిక వసతులు కల్పించినట్లు గుర్తుచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని, వాటి ద్వారా సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర గ్రామాల్లోనూ మౌలిక వసతుల పనులను వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.