epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెళ్లి చేసుకుంటావా లేదా..?!

పెళ్లి చేసుకుంటావా లేదా..?!
కేంద్ర మంత్రి బండి కుమారుడికి యువ‌తి వేధింపులు
స్నేహం పేరుతో దగ్గరై.. తర్వాత బెదిరింపులకు పాల్ప‌డుతోంది
పెళ్లి పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న‌ట్లుగా భ‌గీర‌థ్ ఆరోప‌ణ‌లు
అడిగినంత ఇవ్వ‌కుంటే తప్పుడు కేసులు పెడతామంటూ  వేధింపులు
క‌రీంన‌గ‌ర్ టు టౌన్‌లో ఫిర్యాదు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు
రూ.5 కోట్లు డిమాండ్ చేశార‌ని ఫిర్యాదులో ఆరోప‌ణ‌లు
ద‌ర్యాప్తు ప్రారంభించిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు
చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న కేంద్ర మంత్రి కొడుకు ఫిర్యాదు వ్య‌వ‌హారం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని… అనంతరం పెళ్లి కోసం ఒత్తిడి తీసుకువచ్చి, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారంటూ భగీరథ్ హైద‌రాబాద్‌కు చెందిన కుటుంబ స‌భ్యుల‌పై ఫిర్యాదు చేశారు. పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులోని వివ‌రాల ప్ర‌కారం.. ఓ ఉమ్మడి స్నేహితుడి ద్వారా ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత వారు కుటుంబ స్నేహితులుగా మారారని భగీరథ్ పేర్కొన్నారు. తమ కుటుంబ కార్యక్రమాలు, స్నేహితుల సమావేశాలు, ఆధ్యాత్మిక యాత్రలకు కూడా తీసుకెళ్లి నమ్మకం కల్పించారని తెలిపారు. విజయవాడ, అరుణాచలం, తిరుమల వంటి ప్రాంతాలకు కలిసి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కొంతకాలం తర్వాత పరిస్థితులు మారిపోయాయని… తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తాను నిరాకరించడంతో తనపై తప్పుడు కేసులు పెడతామని, వేధింపులు, శారీరక సంబంధాల పేరుతో ఆరోపణలు చేస్తామని బెదిరించారని ఫిర్యాదులో వివరించారు.
అయినా వేధింపులు ఆగలేదా..?
ఈ వ్యవహారంలో ఖ‌ర్చులకు సంబంధించిన‌వి ప‌రిగ‌ణిస్తూ రూ.50 వేల రూపాయలు చెల్లించిన‌ట్లుగా భగీరథ్ పేర్కొన్నారు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదని… మరింత ఒత్తిడి పెంచారని ఆరోపించారు.
ఇక తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ చర్యలతో తాను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని భగీరథ్ పోలీసులకు వివరించారు. ఈ కేసులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సమస్యనే తన స్నేహితుల్లో మరికొందరు ఎదుర్కొన్నారని… ఇప్పటికే నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదైందని భగీరథ్ తన కంప్లైంట్‌లో ప్రస్తావించారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యక్తిగత వివాదమా..? లేక ప్రణాళికాబద్ధంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముఠా వ్యవహారమా..? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
భగీరథ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు క్రైమ్ నంబర్ 253/2026గా కేసు నమోదు చేశారు. బీఎన్ ఎస్‌ సెక్షన్లు 308(5), 351(2), 61(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు, ఇతర సాక్ష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వ్యక్తులను విచారించే అవకాశమున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి కుమారుడి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసు ఇప్పుడు కరీంనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్నేహం, కుటుంబ సంబంధాలు, ఆధ్యాత్మిక యాత్రలతో ప్రారంభమైన పరిచయం… ఇప్పుడు పోలీస్ కేసు దాకా వెళ్లడం చర్చనీయాంశమైంది. మొత్తంగా… ఈ వ్యవహారం వెనుక అసలు నిజాలు ఏమిటి..? ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది..? డబ్బు డిమాండ్, బెదిరింపుల ఆరోపణలపై పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.