సాంకేతిక పురోగతికి ఆద్యుడు రాజీవ్‌గాంధీ
రాజకీయాల్లో యువశక్తికి ప్రాధాన్యం
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజె మల్లేశం
కాకతీయ, చేర్యాల: దేశంలో పరిపాలనలో సాంకేతిక వినియోగాన్ని పెంచి, ఆధునిక సాంకేతిక పాలనకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజె మల్లేశం కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం చేర్యాల పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ ఐటీ, టెలికాం రంగాల్లో తెచ్చిన సంస్కరణలు దేశాన్ని పరుగులు పెట్టించాయన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఓటు హక్కును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించిన చారిత్రాత్మక నేత ఆయనని స్మరించుకున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆయన ఆశయాల సాధనకే పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామిడీ జీవన్ రెడ్డి, కౌన్సిలర్లు వెలుగల దుర్గయ్య, షారీఫా బేగం, పోతుగంటి ప్రసాద్, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగ రావు, అడెపు చంద్రయ్య, తడాకా లింగమూర్తి గుప్త, పాల లక్ష్మి నారాయణ, తిరుపతి, కాటం శ్రీనివాస్, ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీష్ గౌడ్, కాశెట్టి ఉపేందర్, వినీత్, బుట్టి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

