epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భానుడి భ‌గ‌భ‌గ‌లు

భానుడి భ‌గ‌భ‌గ‌లు
రెడ్ జోన్‌లో కరీంనగర్!
అగ్నిగుండంలా ఉమ్మడి జిల్లా
45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్ర‌త‌లు
తీవ్ర వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి..
నిర్మానుష్యంగా మారుతున్న ప్రధాన చౌరస్తాలు
మధ్యాహ్నం 12 నుంచి 4గంట‌ల వ‌ర‌కు బయటకు రావొద్దని వైద్యుల సూచన
ఆస్పత్రుల్లో పెరుగుతున్న వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : ఎండల తీవ్రతతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పూర్తిగా అగ్నిగుండంలా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న వడగాలులు, భరించలేనంతగా మారుతున్న ఉక్కపోత నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాను అధికారికంగా ‘రెడ్ జోన్’గా ప్రకటించింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప సామాన్య ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా జనసంచారంతో ఎప్పుూ కిటకిటలాడే కరీంనగర్ నగరంలోని ప్రధాన కేంద్రాలైన టవర్ సర్కిల్, కమాన్ చౌరస్తా, ప్రకాశం గంజ్, తెలంగాణ చౌరస్తా ప్రాంతాలు మధ్యాహ్న వేళల్లో పూర్తిగా నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రహదారులపై వాహన రాకపోకలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. మండుతున్న ఎండలకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పనులు ఉన్నవారే బయటకు వస్తుండగా, వారు కూడా తలకు గుడ్డలు కట్టుకుని, గొడుగులు పట్టుకుని ప్రయాణిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలుఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 24 మే 2026 ఆదివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్44.8°, జగిత్యాల44°, రాజన్న సిరిసిల్ల44°, పెద్దపల్లి44°, కరీంనగర్లో మధ్యాహ్న సమయానికి 44.8° ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ సమయంలో సాధారణ మనుషులకు అనిపించే ఉష్ణోగ్రత తీవ్రత ఏకంగా 48°C వరకు వెళ్లడం గమనార్హం. ఇదే సమయంలో గాలి వేగం గంటకు సుమారు 18.4 కిలోమీటర్లుగా నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద 40°C నుంచి 45°C మధ్య తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచించారు.

ఆస్పత్రుల్లో పెరిగిన కేసులు..

తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు మండుతున్న ఎండల దెబ్బకు శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగ, ఐస్ క్రీములు మరియు పండ్ల రసాల కేంద్రాలకు విపరీతమైన రద్దీ పెరిగింది. వాతావరణ శాఖ అధికారిక సూచనల మేరకు ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ బయటి పనులను పూర్తిగా తగ్గించుకోవాలని, తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం తాగుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఎండలో ఎక్కువసేపు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.