వడదెబ్బకు మహిళ మృతి
కాకతీయ,పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాతరెడ్డి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల బయ్యారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం పొనగంటి భద్రమ్మ (53) తమ ఇంటి వద్దనే వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అధికారిక నిర్ధారణ వివరాలు తెలియాల్సి ఉంది.

