గడపగడపకూ బీఎస్పీ!
బూత్ కమిటీల బలోపేతంపై ప్రత్యేక దృష్టి
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ
నియోజకవర్గ సమీక్షలో నేతలకు దొడ్డె సమ్మయ్య పిలుపు
కాకతీయ, హుజురాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి సెక్టార్, బూత్ కమిటీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు దొడ్డె సమ్మయ్య నాయకులకు సూచించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం జమ్మికుంటలో జరిగింది. నియోజకవర్గ అధ్యక్షుడు మంద సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు, నాయకులు ఇప్పుడే రంగంలోకి దిగాలని దొడ్డె సమ్మయ్య పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలు డాక్టర్ అంబాల ప్రభాకర్, వేల్పుల మల్లేష్, మారముల్ల సాంబయ్య, రాచపల్లి రమేష్, గరిగే చంద్రయ్య, రామ్ శ్రీనివాస్, మొలుగూరి శ్రీనివాస్, బీసీ నాయకులు మామిండ్ల మల్లయ్య, దాసరపు ప్రవీణ్, అంబాల అంజి, కోరి రంజిత్, మడిపల్లి చక్రపాణి, సోషల్ మీడియా ఇన్‌చార్జి మంద జగన్ తదితరులు పాల్గొన్నారు.

