epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం కావాలి
ప్రతి కార్యకర్త ఆదర్శ నాయకుడిగా ఎదగాలి
: మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
క‌రీంన‌గ‌ర్‌లో బీజేపీ రెండు రోజుల శిక్షణ శిబిరం ముగింపు
12 విడతలుగా (సెషన్లు) 346 మంది ప్రతినిధులకు దిశానిర్దేశం
కాకతీయ, కరీంనగర్ : పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ (ఎల్ఎండీ)లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ శిబిరం ఆదివారం సాయంత్రం ముగిసింది. ‘పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ పేరుతో నిర్వహించిన ఈ శిబిరంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలకు చెందిన 346 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. శనివారం ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రారంభించి, పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.
12 విడతలుగా విస్తృత శిక్షణ
రెండు రోజుల పాటు మొత్తం 12 విడతలుగా జరిగిన ఈ శిబిరంలో.. పార్టీ ఆవిర్భావం, భావజాలం, లక్ష్యాలు, ప్రజా సమస్యలపై పోరాట విధానం, అధికార పక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొనే వ్యూహాలు, పార్టీ విస్తరణ, సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వినియోగం తదితర అంశాలపై రాష్ట్రస్థాయి నాయకులు విస్తృతంగా వివరించారు. ఒక్కో అంశంపై 45 నిమిషాల నుండి గంటకు పైగా కార్యకర్తలకు శిక్షణ అందించారు. ఈ శిబిరంలో అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి, దేవకి వాసుదేవరావు, అల్జాపూర్ శ్రీనివాస్, బండారి శాంతికుమార్, రాణి రుద్రమ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పోరెడ్డి కిషోర్, రంజిత్ మోహన్, మురళీధర్ రావు, కడగంచి రమేష్, ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ భానుజీ తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించారు.
సమాజంలో ఆదర్శంగా నిలవాలి
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్న ముఖ్యాంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ పార్టీని మరింత విస్తరించాలని సూచించారు. మంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సమాజంలో ఆదర్శ కార్యకర్తలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ శిక్షణ శిబిరంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకట్‌రెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, వివిధ విభాగాల (మోర్చాల) బాధ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.