epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఊక లారీల అక్రమ రవాణా

ఊక లారీల అక్రమ రవాణా
నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్
ఆర్టీఏ అధికారుల కళ్లు గప్పి యథేచ్ఛగా దందా
రాత్రివేళ భీతావహంగా మారుతున్న ప్రధాన రహదారి
స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, సీజ్ చేయాలని ప్రజల డిమాండ్

కాక‌తీయ‌, మణుగూరు : మణుగూరు పరిసర ప్రాంతాల నుంచి ఊక, పత్తి లోడ్లతో నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న లారీల రాకపోకలు స్థానికులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీలు నిర్ణీత సామర్థ్యానికి మించి లోడ్ తీసుకెళ్లకూడదు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. పట్టపగలు, అర్ధరాత్రి అనే తేడా లేకుండా రాక్షస లోడ్‌తో లారీలు ప్రధాన రహదారిపై దూసుకెళ్తుంటే, వాహనదారులు, పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. మణుగూరు నుంచి బయలుదేరే ఊక లారీలను చూస్తే, అధికారుల పర్యవేక్షణ ఎంత నామమాత్రంగా ఉందో అర్థమవుతోంది. ఒక్కో లారీకి సాధారణ సామర్థ్యానికి రెట్టింపు లోడ్‌ను ఎక్కించి, టార్పాలిన్లతో కప్పి రోడ్డుపైకి వదులుతున్నారు. ఈ లోడ్ వాహనం వెడల్పు కంటే ఎక్కువగా ఉండటంతో, ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోడ్ నుంచి ఎగిసిపడే ఊక కళ్లలో పడి వాహనదారులు కింద పడిపోతున్నా, అధికారుల కళ్లు మాత్రం తెరచుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

రాత్రిపూట మరింత దర్జా..
సాధారణంగా రాత్రి 9 గంటలు దాటిందంటే చాలు.. పట్టణ ప్రధాన రహదారిపై ఈ ఓవర్ లోడ్ లారీల హడావిడి మొదలవుతుంది. పట్టణం మధ్యలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడే ఈ భారీ వాహనాలు దూసుకెళ్లడంతో చిన్న వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. గతంలో ఇటువంటి అక్రమ రవాణా వల్ల అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ, సంబంధిత అధికారులు ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని విమర్శలు వస్తున్నాయి. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఓవర్ లోడ్ రవాణా నేరం. అటువంటి వాహనాలకు భారీ జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేసే అధికారం కూడా ఆర్టీఏ, పోలీసు శాఖలకు ఉంది. కానీ మణుగూరులో చెక్‌పోస్టుల వద్ద ఈ లారీలు యథేచ్ఛగా వెళ్తున్నాయంటే, అధికారులకు తెలిసే జరుగుతోందా? లేక ఆయా విభాగాల మధ్య కుమ్మక్కు ఉందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద లోడ్ ఉన్న వాహనాలు అధికారుల కంట పడకపోవడం ఆశ్చర్యకరమే.

స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి..
“ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిది” అని మణుగూరు ప్రజలు వేడుకుంటున్నారు. వెంటనే ఈ లారీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని, డ్రైవర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 24 గంటలూ ప్రధాన రహదారిపై నిఘా పెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. ఇకనైనా ఆర్టీఏ అధికారులు నిద్ర వీడి, రహదారి భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.